విద్యార్థి కోసం జుట్టు కత్తింరించుకున్న టీచర్..


Mon,February 25, 2019 01:22 AM

సాధారణంగా పిల్లలు పాఠశాలల్లో కొంత భయాందోళనకు గురవుతారు. కొంచెం చదవకపోయినా, పొట్టిగా ఉన్నా, అందంగా లేకపోయినా తోటి విద్యార్థులు హేళన చేస్తుంటారు. ఒక దశలో బెదిరింపులకూ గురవుతారు. అమెరికలోని ఓ పాఠశాలలో ఇలానే తోటి విద్యార్థుల నుంచి హేళనకు గురైన విద్యార్థి గురించి క్లాస్ టీచర్ చలించిపోయింది.
school-girl1
తరగతిలో పిల్లలు మౌనంగా ఉన్నా, ఇబ్బందులకు గురైనట్టు కనిపించినా ఏ టీచరైనా ఏం చేస్తారు? వివరాలు ఆరా తీసుకుని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆమెరికాలోని విల్లీస్ ఇండిపెండెంట్ కిండర్ గార్డెన్ పాఠశాలలో చదువుతున్న ఐదేండ్ల ప్రిజిల్లా పేరేజ్‌ది ఇందుకు భిన్నమైన సమస్య. తన జుట్టు చిన్నదిగా ఉన్నందుకు తోటి విద్యార్థుల నుంచి అవమానాలు ఎదుర్కొంది. చూడడానికి తన ఒక అబ్బాయిలా కనిపిస్తున్నదని స్నేహితులు హేళన చేసేవారు. దీంతో ప్రిజిల్లా చాలా బాధపడేది. క్లాస్‌లో ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చునేది. ఇలా ఇబ్బంది పడుతూనూ రోజూ స్కూల్‌కు వచ్చేది. ఇదంతా గమనించిన టీచర్ సనోమ్ గ్రిమ్ వివరాలు కనుక్కుంది.

జట్టు పెద్దగా లేనందుకు బాధపడుతున్నట్టు తెలుసుకుంది. ఆలస్యం చేయకుండా ప్రిజిల్లాకు ఎంత చిన్నజుట్టు ఉందో అంతే సమానంగా సనోమ్ కూడా కత్తిరించుకుని పాఠశాలకు వచ్చింది. జుట్టు చిన్నగా ఉన్నందుకు బాధపడాల్సిన అవసరం లేదు. నా జుట్టు కూడా నీలాగే ఉంది అంటూ ప్రిజిల్లా కు చెప్పింది. దీంతో ప్రిజిల్లా ఆ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చింది. టీచర్‌ని చూసి ప్రిజిల్ల్లా తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుందని ప్రిన్సిపాల్ అన్నారు. తర్వాత జరిగిన స్కూల్ వేడుకలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ నెలకు సంబంధించిన మోస్ట్ ఆక్టివ్ స్టూడెంట్ అవార్డును ప్రిజిల్లాకు సినోమ్ అందించింది. ఒక రకమైన భయాందోళనకు గురవుతూనే ప్రిజిల్లా పాఠశాలకు హాజరైందని ఆ అవార్డును తనకు అందించారు. ప్రిజిల్లా ఆ అవార్డును అందుకుంటూనే దాన్ని మళ్లీ సినోమ్ టీచర్‌కు అందించింది. టీచరే నా హీరో అంటూ అవార్డును సినోమ్‌కు ఇస్తూ సంతోషం వ్యక్తం చేసింది.

1101
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles