విజయానికి లింగబేధం ఉండదు


Sat,May 11, 2019 12:30 AM

చేతివేళ్లే సమానంగా ఉండవు అలాంటిది మహిళలు, పురుషులు సమానంగా ఎలా ఉంటారని పురుషాధిక్య సమాజం వెక్కిరిస్తుంది. కొన్ని రంగాల్లో పురుషులే స్థిరపడాలి. మరికొన్ని రంగాల్లో వాళ్లే విజయం సాధించాలనే అభిప్రాయం ఆయా రంగాల్లో పాతుకుపోయింది. ఇదే దోరనిలో ఉండే మార్షల్ ఆర్ట్స్‌లో కోమల్ రావు అనే మహిళ ఘనమైన విజయం సాధించింది.
komal-rao
మార్షల్ ఆర్ట్స్ అంటే పురుషులే ఎక్కువ ఉండే రంగం. దృఢమైన శరీరం, ఆరోగ్యం కలిగిన వ్యక్తులు ఇందులో రాణిస్తుంటారు. వారితో పోల్చితే ఇందులో మహిళలు తక్కువ మంది ఉంటారు. కానీ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ అనేది మహిళలకు, పురుషులకు కలిపి ఉండే క్రీడ. పురుషులతో కలిసి మహిళలు పోటీ పడాలి. ఈ పోటీల్లో లింగ బేధం ఉండదు. అలాంటి రంగంలోనే ఉంది 35 యేండ్ల మహిళ డాక్టర్ కోమల్ రావ్. మార్షల్ ఆర్ట్స్ బోను ఫైటింగ్‌లో ఆసాధారణ ధైర్యాన్ని చూపిస్తున్నది. పురుషులతో పోటీపడి విజయం సాధిస్తున్నది. 2017లో జర్మనీలో జరిగిన మిక్స్‌డ్ కేజ్ ఫైటింగ్‌లో పురుషుడైన ప్రత్యర్థిని ఓడించింది. బలమైన పంచులతో ప్రత్యర్థిని కిందపడేసి విజయం సాధించింది. దీంతో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో పురుష ప్రత్యర్థిని ఓడించిన మొదటి భారత మహిళగా రికార్డు సృష్టించింది. భారతదేశపు మొదటి కమాండో శిక్షక్షురాలు డాక్టర్ సీమారావ్, మేజర్ దీపక్‌ల దత్త పుత్రిక కోమల్ రావ్. ఈ కుటుంబం ఇటీవలే మైసూర్‌లో స్థిరపడింది. 15 ఏండ్ల వయస్సులోనే కోమల్ జీత్ కు నేదో ( జేకేడీ) అనే మార్షల్ ఆర్ట్స్‌లో చేరింది. బ్రూస్లీ దగ్గర మార్షల్ ఆర్డ్స్ నేర్చుకున్న రిచార్డ్ బష్టిలో దగ్గర కోమల్ శిక్షణ తీసుకుంది. ఇప్పుడు ఆమె ప్రపంచంలోని ఐదుగురి మహిళా శిక్షకురాలల్లో ఒకరిగా రిచర్డ్ నుంచి గుర్తింపు పొందింది. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో గుర్తింపు రావడం, ఇటీవల మహిళల రక్షణ కోసం అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం గర్వంగా ఉందని కోమల్ రావ్ అంటున్నారు.
komal-rao1

174
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles