వాసనతో గుర్తు పట్టేస్తుంది!


Wed,April 17, 2019 11:55 PM

కండ్లకు గంతలు కట్టి.. చేతిలో ఏదైనా వస్తువు పెడితే.. దాన్ని తడిమో, వాసన చూసో, రుచి చూసో అది ఏ వస్తువో చెప్పగలరు. ఏ రంగులో ఉందో చెప్పమంటే మాత్రం చెప్పలేరు. కానీ ఈ అమ్మాయి చెబుతుంది.
smell-with-colour-deepti
నేపాల్‌కు చెందిన పదకొండేండ్ల్ల దీప్తి రెజ్మీ వాసన చూసి ఏ రంగు చెప్పేస్తున్నది. కేవలం వస్తువులే కాదు, న్యూస్‌ పేపర్‌ వాసన చూసి ఎక్కడ ఏ అక్షరాలకు ఏ రంగు ఇచ్చారో కూడా చెప్పేస్తుంది. తనకు ఈ శక్తి ఉన్నట్లు మొదట ఎవరికీ తెలియదు. తెలిసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు. వైద్య పరిభాషలో ఈ స్థితిని ‘సినస్థీషియా’ అంటారు. ఈ సమస్య ఉన్నవాళ్లు వాసన విషయంలో కాస్త అయోమయం అవుతుంటారు. ‘కండ్లతో చూసేదానికీ ముక్కుతో వాసన చూసేదానికీ తేడా ఉంటుంది. దానివల్లే దీప్తి రంగుల్ని వాసన చూడగలుగుతుంది’ అని డాక్టర్లు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నవాళ్లు రెండు వేల మంది వరకూ ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. వీరిలో మహిళలే ఎక్కువ. అయితే ఇది ఎందుకు వస్తుందో మాత్రం ఇంతవరకూ తెలియలేదని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణం ఉన్నవాళ్లు సాధారణంగా సృజనాత్మక రంగాల్లో స్థిరపడుతుంటారు. రష్యన్‌ నవలా రచయిత వ్లాదిమిర్‌ నబకోవ్‌, ప్రముఖ చిత్రకారుడు విన్సెంట్‌ వాన్‌ గో లకి కూడా ఈ సమస్య ఉండేదట. అయితే దీనివల్ల భయపడాల్సిన ప్రమాదాలేమీ ఉండవు అంటున్నారు. దీప్తి రెజ్మీ దీన్ని లోపంగా కాకుండా, ఆమెకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నది.

240
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles