వాషింగ్ మెషిన్ ఉంటే సరిపోదు!


Mon,February 4, 2019 11:07 PM

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో వాషింగ్ మెషిన్ లేని ఇల్లుండదు. కొంతమంది ఇండ్లలో ది ఉన్నా ఎలా వాడాలో తెలియదు. అలాంటి వారు ఈ కింది చిట్కాలు తెలుసుకోండి.
washing-machine
-కరంట్ డిమ్‌గా ఉన్నప్పుడు వాషింగ్ మెషిన్‌ను వాడకూడదు. మెషిన్‌లో పోసే నీరు శుభ్రంగా ఉండాలి. ఉప్పునీరు అసలు పోయకూడదు. లెవల్‌కి మించి నీరు అధికంగా పోయకూడదు. అలా చేస్తే మెషిన్ తొందరగా పాడవుతుంది.
-వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేసేటప్పుడు జేబులో పెన్, పెన్సిల్లు లేకుండా చూసుకోవాలి. వాష్ అయిన తర్వాత స్విచ్‌ఆఫ్ చేయాలి. ఆ తర్వాతే బట్టలు మెషిన్ నుంచి బయటకు తీయాలి.
-తెల్ల బట్టలు ఒకసారి, రంగు బట్టలు మరొకసారి వాషింగ్‌కి వేయాలి. మెషిన్ నడుస్తున్నప్పుడు మూత తప్పనిసరిగా పెట్టాలి లేకుంటే నీళ్లు పైకి చిమ్మగలవు. దీన్ని రోజంతా కొనసాగించకూడదు. మధ్యలో కొంత గ్యాప్ ఇస్తుండాలి.
-తెల్లబట్టలు వేసేముందు నీళ్లల్లో కొంచెం నిమ్మరసం పిండితే మురికి తొలిగి సువాసనా భరితంగా ఉంటాయి. ఆ నీళ్లలోనే కొంచెం నీలిపొడిని కలిపితే బట్టలు ధగధగమని మెరుస్తాయి.
-కాఫీ, టీ పదార్థాలు బట్టలపై పడిన వెంటనే వేన్నీళ్లతో కడిగితే మరకలు పడవు. ఎండిపోయిన మరకలను బోరెక్స్ పొడితో బాగా రుద్ది వేడి నీళ్ళతో ఉతికితే శుభ్రంగా పోతాయి.

253
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles