వాలెంటైన్స్ డే ఎమోషన్స్!


Wed,February 13, 2019 12:47 AM

ఒక్క వాలెంటైన్స్ డే.. ఎన్నో ఎమోషన్స్. ప్రేమించుకునేవాళ్లది లవ్ ఎమోషన్. ప్రేమ వద్దనే వాళ్లది సీరియస్ ఎమోషన్. ఈ రెండూ ఉత్త ముచ్చటే అనుకునేవాళ్లది సోషల్ ఎమోషన్. ఎందుకు? ప్రేమికుల రోజునాడే ఇన్ని ఎమోషన్స్ కనిపిస్తాయి? వారి ఫీలింగ్స్ ఏంటి? ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఆ ఎమోషన్స్‌పై కథనం.
Valantines-Day
కొందరంటారు.. ప్రేమికులకు ఓ ప్రత్యేకమైన రోజు ఎందుకు? అని. మరికొందరు అంటారు ప్రేమికులకంటూ ఓ ప్రత్యేకమైన రోజు ఉండొద్దా? అని. ఎవరి ఫీలింగ్స్.. ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి. కానీ విచిత్రంగా ఆరోజు కొన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తాయి. మీరు రేపు చూడబోయేవాళ్లలో ఈ 14 ఎమోషన్స్ ఉంటాయి గమనించండి.


careless

అంతా కేర్‌లెస్:

లవర్స్ డేస్.. రోజ్ డేస్ లాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. ప్రతీ సండే లాగా అదే బద్దకం ఫేస్ వేసుకొని వాళ్లదైన ప్రపంచంలో ఉంటారు. వీరికి జీరో ఎమోషన్స్.. జీరో ఫీలింగ్స్ ఉంటాయి.


sandesham

రోజూ సందేశమే:

వీళ్లకు ఆ రోజు ఈ రోజు అని తేడా లేదు. న్యూ ఇయర్ నుంచి నాగుల పంచమి వరకు ఏ పండుగనీ వదలరు. మీకు మీ కుటుంబ సభ్యులకు వాలెంటైన్స్‌డే శుభాకాంక్షలు అనే సందేశాలిస్తుంటారు.


aatram

ఆత్రమాత్రం:

వీళ్లు ఇంట్లో ఏ పని ఉన్నా అంతగా ఆత్రుత పడరు. కానీ.. వాలెంటైన్స్ రోజు మాత్రం తెగ ఆత్రుతగా కనిపిస్తుంటారు. అందరికంటే ముందుగాల్నే నిద్రలేస్తారు. రెడీ అవుతారు. తమదైన ప్రేమలోకంలో విహరిస్తుంటారు.


prathyekam

ప్రత్యేకత:

ప్రతీది ప్రత్యేకంగా ఫీలవుతుంటారు. ఏంటీ ప్రత్యేకత? అని అడిగితే.. దీంట్లో ప్రత్యేకతేముంది? నిన్నామొన్న పదింటికి లేచేవాడిని.. ఇయ్యాల ఆరుగంటలకే లేచాను. అంతే అని సింపుల్‌గా చెప్పేస్తారు.


nishabdham

నిశ్శబ్ద రాజ్యం:

వీళ్లు ఎవ్వరితో మాట్లాడరు. కొత్తగా లవర్‌కు ప్రపోజ్‌చేసేవాళ్లు ఈ కేటగిరీకి చెందినవాళ్లు. జరగబోయే దాని గురించి ముందుగానే ఊహించుకొని లోలోపల మురిసిపోతుంటారు. లవర్‌ని కలుస్తున్నాను అనే ఒక్క ఆలోచన తప్ప వేరే ఇంకేదీ వీరికి నచ్చదు. ఎవ్వరు పలకరించినా సైగలతో సమాధానం ఇస్తారు తప్పితే నోరు తెరిచి ఏమీ చెప్పలేరు.


aakali-no

ఆకలేయదు:

పెండ్లి కంటే దీనికే ప్రయారిటీ ఇస్తుంటారు. తిండీ తిప్పలు మానేసి వాలెంటైన్స్‌డే ప్లాన్స్ చేస్తుంటారు. పేరెంట్స్ అడిగితే ప్రాజెక్ట్ వర్క్ ఉంది.. నేనే టీమ్‌లీడర్‌ని అని ఫోజులు కొడుతుంటారు. వీరు శారీరకంగా బలహీనంగా.. మానసికంగా దృఢంగా కనిపిస్తారు.


Choopulu

చూపుల కత్తులు:

వాలెంటైన్స్ రోజు మనం పొరపాటున బాగా రెడీ అయ్యామంటే వీరి చూపుల్లో ఇంటెన్సిటీ పెరుగుతుంది. మనం రెడీ అయ్యి బయటకు వెళ్లే వరకు వాళ్ల చూపులు మనవైపే ఉంటాయి. మనమేదైనా అంటే దానికి కౌంటర్ ఇచ్చేందుకు రెడీగా ఉంటారు.


tension

టెన్షన్ అటెన్షన్:

ఆ రోజు లవర్స్ మొత్తానికి ఒకే ఒక్క ఎమోషన్.. ఇంట్లో తెలియకుండా బయటకు వెళ్లి సైలెంట్‌గా వచ్చేయాలి. వెళ్లడం.. రావడం సైలెంట్‌గా జరిగితే చాలనే భావనతో ఉంటారు. వాళ్లు చూస్తున్నారా? వీళ్లు చూస్తున్నారా? తెలిసినవాళ్లు ఉన్నారా? అనే టెన్షన్‌తో కనిపిస్తారు.


karam

కారం.. వెటకారం:

వాలెంటైన్స్‌రోజు కొత్త బట్టలు వేస్తే.. అదిరిందయ్యా చంద్రం.. కొత్త డ్రెస్సు.. కొత్త షూసు.. అని వెటకారం చేస్తారు ఫ్రెండ్స్. ఇంట్లో నుంచి బైక్ తీసినా ఓహో.. వెళ్తున్నావా? వెళ్లు వెళ్లు అని వెటకారంగా మాట్లాడుతారు. ఇలాంటి ఫ్రెండ్స్‌కి మాట
తెలియకుండా ఉండాలి.


build-up

బిల్డప్పే బిల్డప్:

లవర్ లేకపోయినా అందరికీ ప్లేబాయ్‌గా బిల్డప్ ఇస్తుంటారు. ఒకవేళ ఖాళీగా ఉన్నాకూడా బిజీగా ఉన్నట్లు నటిస్తుంటారు. ఐతే ఇలాంటివాళ్లు అందరికీ తగలరు. చాలా అరుదుగా కనిపిస్తారు.


aanandam

ఆనంద మానంద మాయె:

బర్త్‌డే రోజు ఆనందాన్ని చాక్లెట్స్‌తో పంచుకున్నట్లు.. వాలెంటైన్స్‌డే పూలతో పంచుకుంటారు. పువ్వును చేతిలో పట్టుకొని కనిపిస్తుంటారు. ఎక్కడ ఎవ్వరికి ప్రపోజ్ చేయాలనే ధ్యాసతో కనిపిస్తుంటారు వీళ్లు.


charges

వామ్మో చార్జెస్:

వాట్సప్.. ఫేస్‌బుక్.. మెసెంజర్‌లతో అంతా కాపురం చేస్తుంటే వీళ్లు మాత్రం వారం ముందు నుంచి మెసేజ్‌లు పంపుతుంటారు. ఫిబ్రవరి 14నాడు ఎసెమ్మెస్ చార్జెస్ బాగా వాచిపోద్ది అని వీళ్ల ఫీలింగ్.


anumaanam

అణువణువూ అనుమానం:

ఒక్క వాలెంటైన్స్ డే నాడే కాకుండా ప్రతీరోజు వీళ్లకు అనుమానమే. తన గురించి తాను ఏదీ పట్టించుకోడు. కానీ అమ్మాయిలు.. అబ్బాయిలు కనిపిస్తే ఏదేదో ఊహించుకొని.. ఈ లోకం పాడైపోయింది అనే ఉద్ధరించే సందేశాలు ఇస్తుంటాడు.


Frustration

ఫ్రస్టేషన్ ఫ్రస్టేషన్:

రోడ్డుపై ఎవ్వరు కనిపించినా వాళ్లు లవర్లు అనే కోణంలోనే చూస్తుంటారు వీరు. ఒక రకంగా వాలెంటైన్స్ డే వీళ్లకు చిరాకు తెప్పిస్తుంది. తీవ్ర ఫ్రస్టేషన్లో కనిపిస్తుంటారు. ఎవరైనా ప్రేమిస్తే తప్పేంటి అని అంటే వారికి గట్టిగనే క్లాస్ తీసుకుంటారు.

464
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles