వాట్‌నాట్.. ఉబెర్‌బోట్!


Fri,April 12, 2019 12:50 AM

కార్లు అద్దెకివ్వడం, ఫుడ్ డెలివరీ చేయడం నుంచి ఉబెర్ ఒక ముందడుగు వేసింది. ఏకంగా బోట్ సర్వీస్‌నే మొదలుపెట్టింది.
UberBOAT-mumbaI
రవాణాధారిత సంస్థల్లో నంబర్ వన్‌గా రాణిస్తున్న ఉబెర్ మరో అడుగు ముందుకేసింది. తమ అప్లికేషన్ లిస్ట్‌లోకి తాజాగా ఉబెర్ బోట్‌ను కూడా చేర్చింది. ఇప్పటికే ఆహార ఉత్పత్తి, రవాణా రంగాల్లో రాణిస్తున్న ఈ సంస్థ సముద్ర రవాణా కూడా ప్రారంభించింది. ఉబెర్ సంస్థ ప్రధానంగా తమ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరించినా బోట్ సర్వీసును ముంబైకి మాత్రమే పరిమితం చేసింది. ఉబెర్ బోట్ సర్వీస్‌ను వినియోగించుకోవడం కోసం ముంబై వాసులే కాదు.. ముంబైకి వెళ్లే పర్యాటకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. మహారాష్ట్ర మెరిటైం బోర్డు, ఉబెర్ సంయుక్తంగా ఈ సర్వీసును అందిస్తున్నాయి. మొదటి విడుతలో భాగంగా ముంబై నుంచి రెండు ప్రదేశాలకు మాత్రమే బోట్ సర్వీసులను అందిస్తున్నారు. ముంబై నుంచి ఎలిఫెంటా, మాండ్వా జెట్టి వరకు బోట్లను నడుపుతున్నారు. యాప్‌లోనే ఉబెర్‌గో, ఉబెర్‌పూల్, ప్రీమియర్, మోటో, ఆటోలాగే ఉబెర్ బోట్ సర్వీస్ ఉంటుంది. ఉబెర్ బోట్‌లో ఆరు నుంచి ఎనిమిది మంది ప్రయాణించవచ్చు. ప్రయాణచార్జీలు అందరికీ కలిపి 5,700 రూపాయలు ఉంటుంది. ఉబెర్ బోట్ ఎక్స్‌ఎల్ సర్వీస్‌లో పన్నెండు మంది వరకు ప్రయాణం చేయొచ్చు. అందరికీ కలిపి ప్రయాణచార్జీలు 9,500 రూపాయలుగా నిర్ణయించారు. ఉబెర్‌బోట్‌లో ప్రయాణం చేయాలనుకునే వాళ్లు ముందే తమ సీటును బుక్ చేసుకోవచ్చు. లేకపోతే పదిహేను నిమిషాలు ముందు పోర్టుకు వెళ్లి బుక్ చేసుకునే వెసులుబాటు ఉన్నది. 2017లోనే క్రొయెషియా దేశంలో ఉబెర్ బోట్ ప్రయాణాలను మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని ప్రధాన పోర్టుల్లో తమ సేవలను విస్తరించనున్నది ఉబెర్ ఇండియా.

208
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles