వాట్సప్‌లో కొత్త ఫీచర్!


Wed,January 23, 2019 01:28 AM

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వాట్సప్ రోజురోజుకు వినియోగదారులను అలరిస్తున్నది. ఉన్న ఫీచర్లను రీడిజైన్ చేయడం, కొత్త ఫీచర్లను క్రియేట్ చేస్తూ వాట్సప్ దూసుకుపోతున్నది. మరో కొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
whatsapp
వాట్సప్ బెటాఇన్ఫో విడుదల చేసిన రిపోర్టు ప్రకారం వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయడానికి కసరత్తు చేస్తున్నది. ఈ ఫీచర్‌తో మనం పంపే ఆడియో ఫైల్స్ ప్రివ్యూ చూసుకోవచ్చు. దానికి ఇమేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఒకేసారి 30 ఫైల్స్ అవతలి వారికి పంపే సౌకర్యం కూడా కల్పిస్తుంది. ప్రస్తుతం బెటా వర్షన్ వాడుతున్న వారికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ మధ్యే వచ్చిన కొత్త ఫీచర్ వాట్సప్ పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అనే ఫీచర్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నది. దీని ద్వారా యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి షేర్ చేసిన వీడియోలను ఆయా వెబ్‌సైట్‌లోకి వెళ్లకుండా నేరుగా వాట్సప్‌లోనే వీక్షించవచ్చన్నమాట. వాట్సప్ గ్రూపుల్లో చాటింగ్ చేసుకునే వారి కోసం కూడా వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. గ్రూపులో ఉన్న ఎవరికైనా మెసేజ్ పంపాలంటే నేరుగా ప్రైవేట్ రిైప్లెలో పంపొచ్చు. ప్రత్యేకంగా వారి కాంటాక్ట్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు.

567
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles