వాచిన పెదాలతో ఇబ్బంది పడుతున్నారా?


Sun,January 20, 2019 01:17 AM

శీతాకాలం పెదాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వాడిపోయినట్టుగా, నిర్జీవంగా పేలగా తయారవుతాయి. కొందరికి పెదాలు వాపునకు గురవుతాయి. మరి అలాంటి వాచిన పెదాలు వెంటనే తగ్గాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి..
lips
-కొన్ని ఐస్‌ముక్కలను కాటన్ గుడ్డలో తీసుకోవాలి. వాటితో సున్నితంగా పెదాలపై మర్దన చేయాలి. రోజులో నాలుగైదు సార్లు ఇలా చేయటం ద్వారా ఫలితం ఉంటుంది. ఐస్‌ముక్కలను నేరుగా పెదాలకు తాకించవద్దు.
-తాజా కలబంద నుంచి టీస్పూన్ జెల్ తీసుకోవాలి. వీలయినన్ని సార్లు పెదాలకు పూస్తే వాపు తగ్గుతుంది.
-తేనెను ఉపయోగించి ఈ సమస్యకు చెక్‌పెట్టొచ్చు . ఒక టీస్పూన్ తేనెలో కాటన్ బాల్‌ను ఉంచండి. చల్లని నీటితో మొహం కడిగి ఆ బాల్‌ను పెదాలపై మర్దన చేయండి.
-ఒక స్పూన్ పసుపును, చల్లని నీటితో కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై పూసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఒక రోజులో మూడు సార్లు చేస్తే వాచిన పెదాలు తగ్గిపోతాయి. దీంతో పాటు ఏదైన నొప్పి ఉన్నా నయం అవుతుంది.

383
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles