వాక్‌థాన్ విజయాల బామ్మ!


Sat,March 9, 2019 12:42 AM

ఎనభై యేడేండ్ల బామ్మ తన సంతోషాలు, పాత జ్ఞాపకాలను అందరితో పంచుకుంటున్నది. జవహర్‌లాల్ నెహ్రు, నేపాల్ రాజు ఇలా ఎందరినో కలిసిన తర్వాత పొందిన అనుభూతిని తెలియజేస్తుంది. ఇంత వయసులోనూ సంతోషంగా ఉండడానికి గల మంత్రమేంటో చెబుతున్నది.
varma
పుణేకు చెందిన 87 యేండ్ల రీనా వర్మ భారతదేశపు మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నది. జవహర్‌లాల్ నెహ్రు, క్వీన్ ఎలిజబెత్, నేపాల్ రాజుని కలుసుకున్న సందర్భాలను వివరిస్తున్నది. వర్మ 1932 రావల్పిండిలో జన్మించింది. ఆమె అక్కడే చదువుకుంటూ హాస్టల్‌లో ఉండేది. తండ్రి రావల్పిండి ప్రాంతం శివార్లలో ఉన్న ముర్రీ, హిల్ స్టేషన్‌లో ఉద్యోగం చేసేవాడు. వర్మ చిన్నతనం అంతా బ్రిటీష్ కుటుంబాల దగ్గరే గడిచింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి గణతంత్ర దినోత్సవానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్మ పాల్గొన్నది. ఆ కార్యక్రమంలో నిక్క మోటా బిజ్ర అనే పాట పంజాబ్ ఫ్లోట్‌తో కలిసి పాడే అవకాశం వచ్చిందట. చదువు పూర్తయిన తర్వాత వివాహం చేసుకొని బెంగళూరులో స్థిరపడింది. ఉద్యోగం చేసే సమయంలోనే నేపాల్ రాజు తన కౌంటర్ దగ్గరికి వచ్చి కొన్ని ప్రదర్శనల గురించి అడిగి కనుక్కోవడంతో ఆయనతో మాట్లాడే అవకాశాన్ని పొందింది.

వర్మ అన్నయ్య నేషనల్ డెఫెన్స్ అకాడమీలో పనిచేస్తున్నప్పుడు జవహర్‌లాల్ నెహ్రుతో వర్మ, తన తండ్రి కొన్ని నిమిషాలు మాట్లాడారు. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనంటున్నది వర్మ. ఆమె భర్త బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగ విరమణ తీసుకున్నాక సరైన ఉపాధి లేక ఇళ్లు గడువడం కష్టంగా ఉన్న రోజులవి. అయినా వర్మ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని గట్టెక్కించింది. 75 యేండ్ల వయసులో నథులా పాస్ కొండలను ఒంటరిగా ఎక్కింది. 87 యేండ్ల వయసులో వాకథాన్స్‌లో పాల్గొంటున్నది. ఇప్పటి వరకు మూడు వాకథాన్‌లలో విజయం సాధించింది. ఇంత సంతోషంగా ఉండడానికి మంత్రమేంటో చెప్తుంది. మొదటిది ఇతరుల మీద ఆధారపడకూడదు. రెండోది చేస్తున్న పనిని ఇష్టపడాలి. మూడు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎపుడూ ఒకలాగే బతకాలి. ఈ మూడు ఉంటే మీ జీవితం ఆనందమయమే అంటున్నది వర్మ. 87వ పుట్టినరోజునాడు వర్మ చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.

612
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles