వసంతపంచమి తిరుగులేని శుభదినం!


Fri,February 8, 2019 01:13 AM

Endukante
మాఘశుక్ల వసంతపంచమిని చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినంగా జరుపుకుంటాం. పిల్లలకు అక్షరాభాస్యం మాత్రమే కాదు, అన్ని రకాల శుభకార్యాలూ ఇవాళ ప్రారంభించుకోవచ్చు. ఇదెంత శుభదినమంటే, ఎవరు ఎలాంటి శుభకార్యమైనా చక్కగా, ప్రత్యేక ముహూర్తాలతో పని లేకుండా ఆచరించుకోవచ్చునని వేద పండితులు అంటారు. ఇంతగా తిరుగులేని శుభదినంగా వసంతపంచమి ప్రాచుర్యంలోకి రావడానికి దీనికి వున్న గొప్ప విశిష్ఠతే ప్రధాన కారణమని వారు చెప్తారు. తిథులన్నింటిలోకీ ప్రతీ పంచమి ఉత్తమమైంది. ఇక, వసంతపంచమి గురించి చెప్పక్కర్లేదు. ప్రాచీన కాలంలో నాలుగే ఋతువులు ఉండేవని, మాఘమాసాన్ని వసంతఋతువులో భాగంగానే అప్పట్లో పరిగణించే వారనీ చెప్తారు. సమస్త సృష్టి మనుగడకు మూలమైన ప్రణవ స్వరూపిణియేగాక పరాశక్తిగానూ సరస్వతీ మాత పూజలు అందుకుంటుంది. మనలోని ఆత్మజ్యోతికి ప్రతీక ఈ వేదమాత. అంతేకాదు, సర అంటే కాంతి. మన జీవితాలకు వెలుగునిచ్చేదనీ అర్థం.

363
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles