వయ్యారి.. అతిలోక సుందరి


Wed,December 19, 2018 01:07 AM

వందల మంది వయ్యారి భామలు.. రెడ్ కార్పెట్ మీద హంస నడకలు నడస్తుంటే ఆ దృశ్యం చూడతరమా? ప్రపంచదేశాల సుందరీమణులు వరుసకట్టి తమ అందచందాలను ఆరబోస్తుంటే అక్షరాల్లో వర్ణించడం సాధ్యమా? ప్రపంచసుందరిగా కిరీటం సాధించిన ఫిలిప్పీన్స్ అందగతీతె క్యాట్రియోనో గురించి ఆసక్తికరమైన సంగతులు.
ABS-CBN-BALL
పూర్తి పేరు : క్యాట్రియోనో ఎలైసా గ్రే
చదువు : మసాచుసెట్స్ బాస్టన్‌లోని బెర్క్ లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో మ్యూజిక్ థియరీలో మాస్టర్ డిగ్రీ
దేశం : పిలిప్పెన్స్
-94 మంది పాల్గొన్న ఈ పోటీలో మొదటి స్థానంలో నిలిచి గెలిచింది.
-2016లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో ఐదో స్థానంలో నిలిచింది.
-మోడల్‌గా ఎన్నో మ్యాగజైన్లకు ఫోజులిచ్చింది. ఫిలిప్పీన్స్ ప్రజలకు సుపరిచితురాలు.
-మోడలింగ్ ఒక్కటే కాకుండా సింగర్‌గా, బ్లాగర్‌గా, సామాజిక సేవకురాలిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది.
-మహిళల హక్కుల కోసం, మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నది.
-నిరుపేద పసిపిల్లల పాఠశాల భవనాల నిర్మాణం కోసం ఒక ప్రాజెక్ట్‌లో పనిచేసింది.
-అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, థాయిలాండ్, వియత్నాం, చైనా వంటి ఎన్నో దేశాలు తిరిగింది. ప్రపంచాన్ని చుట్టేయాలన్నది ఆమె కోరిక.
-ఎక్కడికి వెళ్లినా ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డాక్యుమెంటేషన్ చేసి బ్లాగ్ క్యాట్ ఎల్లె డాట్ కామ్ అనే సంస్థకు ఇస్తుంది.
-మోడల్, సెంచూరీ తునా సూపర్‌బాడ్ 2016 ఫస్ట్ రన్నరప్ క్లింట్ అనే యువకుడితో ప్రేమలో పడింది. గెలువగానే క్లింట్ తన ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ కూడా చేశాడు.
-మిస్ వరల్డ్ పోటీల్లో రెండు పాటలు పాడి అందరినీ అలరించింది.

563
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles