వడదెబ్బతో జాగ్రత్త!


Sat,April 13, 2019 12:32 AM

sunstroke
-ఎండాకాలం వేడి పదార్థాలు, వేడి వేడిగా చాయి, మసాలా ఫుడ్స్ తీసుకోవడం మంచిది కాదు. సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడు వేడి పదార్థాలు తీసుకుంటే తరువాత బయటికి వెళ్లినప్పుడు శరీరానికి మరింత వేడి తగులుతుంది. మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల కూడా ఎండ దెబ్బ తగులుతుందని గుర్తుంచుకోవాలి.
-ఎండాకాలంలో ఎక్కడికైనా ప్రయాణించాల్సి వస్తే కచ్చితంగా వెంట నీటిని తీసుకెళ్లాలి. ప్రతి ఇరవై నిమిషాలకోసారి దాహం వేయకపోయినా గుక్కెడు నీళ్లు తాగాలి. మజ్జిగ, పండ్లరసాలు, నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే ఇంకా మంచిది.
-గుండె/ నాడి కొట్టుకోవడం, వేగంగా/ తక్కువగా శ్వాస తీసుకోవడం, ఎక్కువ లేదా తక్కువ రక్తపోటు, చెమట పట్టకపోవడం, చిరాకు, కంగారు లేదా అపస్మారక స్థితికి చేరుకోవడం తల తిరగడం తలపోటు, వికారం (వాంతులు) వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లే.
-వడదెబ్బ ముదిరితే, స్పృహ కోల్పోవడం, మానసిక కలత, చేతులు కాళ్లు లాగేయడం, అకస్మాత్తుగా వ్యాధులు రావడం జరుగుతుంది. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లబర్చాలి. వీలుంటే చల్లటి నీటిలో మునగనివ్వాలి. తడిబట్టలతో చుట్టాలి.

253
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles