వంటింటి చిట్కాలు


Fri,February 15, 2019 11:28 PM

vantinti-chitkalu
-భక్షాలు సరిగా రాకుంటే కొంచెం గోధుమరవ్వ కలిపితే బాగా వస్తాయి.
-మజ్జిగ, నిమ్మరసం, చక్కెర మిశ్రమాన్ని కేక్ తయారీలో బేకింగ్ పౌడర్‌కి బదులుగా వాడొచ్చు.
-సాంబారులో ఉప్పు ఎక్కువైతే కొన్ని బొగ్గులను బట్టలో కట్టి 15 నిమిషాలు అందులో ఉంచాలి. కాసేపయ్యాక తీసేస్తే ఉప్పు తీవ్రత తగ్గుతుంది.
-నెయ్యికాచి దించేటప్పుడు కొంచెం మెంతులు వేస్తే మంచి సువాసన వస్తుంది.
-గోరువెచ్చని పాలలో కొంచెం ఉప్పు, నిమ్మరసం పిండితే మజ్జిగలా తయారవుతుంది.
-ఎండాకాలం పాలు విరగకుండా ఉండాలంటే పళ్ళెంలో నీళ్ళుపోసి పాలగిన్నెను అందులో ఉంచాలి.
-పకోడీలు చేసేటప్పుడు కొంచెం సోడా కలిపితే లావుగా వస్తాయి.
-బిస్కెట్ పాకెట్‌ను బియ్యం డబ్బాలో ఉంచడం వల్ల తొందరగా మెత్తబడవు.
-వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూను పాలు వేయాలి.
-పాలతో వెండివస్తువులను కడగడం వల్ల పట్టిన గార పోతుంది.
-పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి.

287
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles