వంటింటి చిట్కాలు


Wed,May 15, 2019 01:13 AM

vantinti-chitkalu
-శనగపిండిలో బియ్యపు పిండి, మిఠాయి రంగు కలుపుతుంటారు. కొద్దిగా పిండిలో నీరు కలుపండి. నీటి రంగు ఎరుపుకు మారితే ఆ పిండి కల్తీదే.
-వెన్న, నెయ్యిలో కొద్దిగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం, చక్కెర మిశ్రమాన్ని కలుపాలి. ఐదు నిమిషాల తర్వాత నెయ్యి, వెన్న ఎరుపు రంగుకి మారితే కల్తీ అని భావించండి.
-ఆలు గడ్డలకి కొద్దిగా అయోడిన్ కలిపినప్పుడు నీలిరంగు ఏర్పడినట్లయితే అందులో కల్తీ జరిగినట్లుగా గుర్తించాలి.
-చక్కెరలో సుద్దముక్కల పొడి, బొంబాయి రవ్వ కలుపుతుంటారు. చక్కెరను నీటిలో వేస్తే కరుగుతుంది. అడుగున రవ్వకనిపించినా, నీరు తెల్లగా కనిపించినా అది కల్తీనే.
-జీలకర్ర మంచిదా, నకిలీదా అని తెలుసుకోవడానికి కొద్దిగా జీలకర్రను రెండు చేతుల మధ్య నలపండి. చేతికి రంగు అంటితే అది నకిలీదే.
-బిర్యానీ వండేటప్పుడు నిమ్మకాయ రసం పిండే అన్నం గడ్డలుగా కాకుండా పొడిపొడిగా ఉంటుంది. పులిహోరా వంటివి పొడిపొడిగా ఉండాలంటే వండేటప్పుడు స్పూన్‌కు వెన్న చేర్చాలి.

206
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles