వంటింటి చిట్కాలు


Wed,March 6, 2019 02:41 AM

vantinti-chitkalu
-రోటీలు మెత్తగా రావాలంటే పాలతో పాటు కొంచెం పెరుగు కూడా కలుపండి. మెత్తదనంతో పాటు రుచికరంగా ఉంటాయి.
-వేయించిన రవ్వలో పెరుగు కలిపి కాసేపు ఉంచి తగినన్ని నీళ్లు పోస్తే రవ్వదోశలు బాగా వస్తాయి.
-చాలామంది కూరల్లో పాలు, పెరుగు వేస్తుంటారు. దీంతో కూర పులుపుగా మారుతుంది.
-నిలువ చేయాలనుకునే పచ్చళ్లకు ఆవనూనె వాడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. అంతేకాకుండా ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా మట్టి పాత్రల్లో ఉంచిన ఊరగాయ మరింత రుచినిస్తుంది.
-అవకాడో, యాపిల్స్, అరటిపండ్లు, నారింజ, బెర్రీస్, పీచ్, ఆప్రికాట్ వంటి ప్రూట్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెడితే ఫ్లేవర్ తగ్గిపోతుంది. తినేముందు అరగంట ముందు పెడితే సరిపోతుంది.
-బ్రెడ్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అది త్వరగా ఎండిపోతుంది. దీంతో బ్రెడ్ తినడానికి ఫ్రెష్‌గా అనిపించదు. కాబట్టి రూం టెంపరేచర్‌లోనే ఉంచాలి.

410
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles