వంటింటి చిట్కాలు


Mon,March 11, 2019 12:42 AM

vantinti-chitkalu
-వెల్లుల్లి పాయలు, అల్లం ముక్కలను నూనెలో వేయించి ఆ తర్వాత పేస్ట్ చేసుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. దీనికి నీరు తగలకుండా ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
-కొబ్బరి కోరు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కొబ్బరిని తురిమి రోజంతా ఎండబెట్టాలి. ఒక సీసాలో వేసి గట్టిగా మూత పెడితే నెల రోజులకు పైగా నిల్వ ఉంటుంది.
-వడియాలు పెట్టేందుకు బియ్యపు పిండి వాడితే చాలా రుచిగా ఉంటాయి. అదే మిల్లులో మర ఆడించిన బియ్యం పిండితో అయితే వడియాలు అంత బాగా రావు.
-దోసకాయలను ఉడికించేటప్పుడు వాటిలోని చేదు పోవాలంటే ముక్కలకు కాస్త ఉప్పు కలుపాలి.
-కాకరకాయలోని చేదుపోవాలంటే కట్ చేసిన ముక్కలకు ఉప్పు కలిపి కాసేపు పక్కన పెట్టి వేయించాలి.

648
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles