
-చికెన్ వేయించేటప్పుడు మొక్కజొన్న పిండికి బదులు పాలపొడి వేస్తే మంచి రంగులోకి వస్తుంది.
-పూరీలు చేసేటప్పుడు వేడి నూనెలో నాలుగు జామ ఆకులు వేస్తే రంగు మారకుండా తెల్లగా ఉంటాయి.
-ఆకు కూరలను ఇనుప భాండ్లీలో వండకూడదు. నల్లబడిపోతాయి.
-కాలీఫ్లవర్ ఉడికేటప్పుడు కొంచెం పాలు పోస్తే దింపిన తరువాత కూడా రంగు మారకుండా ఉంటాయి.
-బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉంటే కొంచెం ఉప్పు వేసి కడిగితే నీళ్ళలో కరిగి పోతాయి.
-కూరగాయ ముక్కల్ని పసుపు కలిపిన నీటిల ఉంచితే క్రిములు నీటిపైకి తేలిపోతాయి.