వంటగ్యాస్ పొదుపు ఇలా!


Mon,February 11, 2019 11:13 PM

gas
-రోజూ చేసే వంటలు తినే సమయానికి చల్లగా అవుతుంటాయి. వాటిని మరలా వేడి చేయడం వల్ల గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది. చేసిన కూరలను హాట్‌బాక్స్‌లో పెట్టుకుంటే మళ్లీ వేడి చేయనవసరం లేదు.
-కాఫీ, చాయ్ లేకుండా పూట గడువదు. తాగిన ప్రతిసారీ వేడి చేయాలంటే కష్టం. ఒకేసారి సరిపడా కాఫీ, చాయ్ చేసుకొని ప్లాస్క్‌లో పోసి ఉంచితే మళ్లీ మళ్లీ వేడి చేయాల్సిన అవసరం ఉండదు.
-చాలామంది వంట చేస్తూ ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. మరిచిపోవడం వల్ల వంట గిన్నెలన్నీ పెంకులుగా మారుతాయి. అంతేకాకుండా గ్యాస్ సైతం వృథా అవుతుంది. వేరే పనులు చేస్తున్నా సరే గమనిస్తూ ఉండాలి. లేదంటే ఆదా చేసిన గ్యాస్ అంతా ఒక్కరోజులో మాయమవుతుంది.

353
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles