వంటగది భద్రమేనా?


Tue,February 26, 2019 01:16 AM

ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోటు వంట గది కాబట్టి చాలాజాగ్రత్తలు తీసుకోవాలి. పేపర్స్, ప్లాస్టిక్, బ్యాగ్స్, కర్టెన్స్ వంటివి వంటగదిలో ఉంచకుండా చూసుకోవాలి.
kitchen
-వంట గ్యాస్ పొయ్యి బర్నర్లను తరచుగా శుభ్రం చేసుకోవాలి. వాటిలో ఇరికిన చెత్త కారణంగా గ్యాస్ సరిగా వెలువడక బయటికి ప్రసరించి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
-వంట చేసే ప్రదేశంలోనే అన్ని వస్తువులను ఉంచుకుంటారు అందరూ. కానీ స్టౌ సమీపంలో నూనె డబ్బాను ఉంచకూడదు. ప్రమాదం జరిగితే అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది.
-స్టౌపై ఉన్న గోడకు ఎలాంటి వస్తువులు వేలాడదీయవద్దు. ముఖ్యంగా తుండు గుడ్డలు, హ్యాండ్ కర్చీఫ్‌లు వంటివి వేలాడదీయవద్దు. ఎక్కువగా మంట పెట్టినప్పుడు స్టౌపై ఉన్న గిన్నె పక్కల నుంచి మంట వ్యాపించే ప్రమాదం ఉంది.
-గ్యాస్ పొయ్యికి సమీపంలో మండే వస్తువులను ఉంచరాదు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మంటలను ఆర్పేందుకు పరికరాలను అందుబాటులో ఉంచాలి.
-కొందరు యేండ్ల తరబడి స్టౌ పైపును మార్చకుండా అలాగే వాడుతుంటారు. స్టౌ పైపు లీకేజీ అయినా కాకపోయినా ఏడాదికోసారి పైపును మార్చడం మంచిది.

329
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles