వంటగది అందంగా..ఆకర్షణీయంగా..


Thu,January 31, 2019 12:28 AM

వంటగదిని అందంగా ఉంచడం చాలా కష్టం. కానీ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే వంటగదిని అందంగా.. ఆకర్షణీయంగా ఉంచవచ్చు..
kitchen
వంటింటి మీద కాస్త శ్రద్ధ పెడితే ఈజీగా తీర్చిదిద్దవచ్చు. ఈ గదిలోనే ఎక్కువ సామాగ్రి, వంట దినుసులు ఉంటాయి. టీపొడి, పప్పుదినుసులు, కారం, పసుపు, నూనె లేనిదే రోజు గడవదు. ఇవి రోజూ వాడే వస్తువుల్లో ముఖ్యమైనవి. వీటిని ప్రతిసారి వెతికే పని లేకుండా ట్రాన్సపరెంట్ డబ్బాలు వాడాలి. అవసరమైతే డబ్బా మీద పేరు రాసుకోవాలి. దీని వల్ల గృహిణులు ఇంట్లో లేకపోయినా మగవాళ్లు వంటచేసుకోవడానికి వీలుంటుంది. కిచెన్‌సెట్ కంటైనర్‌లో సరుకులు సర్దుకుంటే ఇంట్లో వారితో పాటు ఎప్పుడైన అతిథులు వస్తే చొరవతీసుకునేందుకు వీలుంటుంది. పాత్రలను, సరుకులను కలగాపులగంగా పారేయకుండా కప్‌బోర్డులో పెట్టుకుంటే కిచెన్‌లో కొత్తవారికి కూడా ఇబ్బంది ఉండదు. దీంతోపాటు వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచితే అంత మంచిది. అయితే రోజూ ఎంత క్లీన్ చేసినా ఎక్కడో ఒకచోట మరకలు కనిపిస్తాయి. అలాంటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా బేకింగ్ సోడాను ఉపయోగించటం ద్వారా ఇలాంటి సమస్యలు రావు. ఇది మరకలను నివారించటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. సింక్‌డ్రెయినేజీ పాత్‌వేలలో ఒక్కోసారి వ్యర్థాలు జామ్ అయి దుర్వాసన వస్తుంటుంది. దీన్ని నివారించడానికి నిమ్మ, వెనిగర్, సోడాలు ఉపయోగపడతాయి. వీటిని కలిపి పాత్‌వేలలో పోస్తే వ్యర్థాలతోపాటు దుర్వాసన పోయే అవకాశం ఉంది.

256
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles