ల్యూకోడెర్మాకు ల్యూకో కిట్


Wed,May 10, 2017 11:57 PM

ల్యూకోడెర్మా అంటే తెల్ల మచ్చల వ్యాధికి మందులేదనే అపోహ ప్రచారంలో ఉంది. బతికినంత కాలం మందులు వాడుతూనే ఉండాలి తప్ప శాశ్వతంగా తగ్గిపోయే అవకాశమే లేదంటూ వాళ్లు కూడా ప్రచారం మొదలుపెడతారు. ఇవన్నీ కలిసి అంతిమంగా తెల్లమచ్చలతో బాధపడేవారంతా వైద్య విధానాల మీద ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయుర్వేదంలో ఈ సమస్యకు మంచి పరిష్కారాలున్నాయి. ఐదు వేల ఏళ్ల క్రితమే ఆయుర్వేద శాస్త్రం ఈ వ్యాధిని సమూలంగా తొలగించి ఔషధ మూలికలను సూచించింది. ఆ మూలికలను ఉపయోగించి ల్యూకో కిట్ అనే ఔషధాన్ని తయారు చేశారు.
leucoderma

కారణాలెన్నో ..


తెల్లమచ్చలు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా, శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం ఒక ముఖ్యమైన కారణం. రక్తంలో విషపదార్థాలు చేరడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పడిపోతుంది. ఫలితంగా శరీరంలోని మెలనిన్ తగ్గిపోయి చర్మం సహజ వర్ణాన్ని కోల్పోతుంది. ఇది తెల్ల మచ్చలు రావడానికి కారణమవుతుంది. ఆహారంలో ఫెర్రస్, కాపర్ లోపించడం కూడా ఇందుకు కారణమవుతుంది. శరీరంలో సహజంగానే హానికారకమైన ప్రీరాడికల్స్ తిరుగుతూ ఉంటాయి. పండ్లలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు వాటికి విరుగుడుగా పనిచేస్తుంటాయి. పండ్లు తీసుకోకుండా ఉండిపోయే వారిలో ఈ ప్రీరాడికల్స్ సంఖ్య పెరిగిపోయి తెల్ల మచ్చలు ఏర్పడవచ్చు. నానాటికీ ప్రకృతికి దూరమైపోతున్న కారణంగా మానవ శరీరాల్లో విటమిన్ డి తగ్గిపోతుంది. ఫలితంగా శరీరానికి వర్ణాన్ని ఇచ్చే మెలనోసైట్స్ తగ్గిపోతాయి. దీంతో తెల్ల మచ్చలు ఏర్పడుతాయి. అయితే ఏ కారణంగా వచ్చిన తెల్లమచ్చలైనా ఈ లూకో కిట్ ఔషధాలతో తగ్గిపోతాయి. ఇందులో కృత్రిమ రసాయనాలు లేనందువల్ల ఏ రకమైన దుష్ప్రభావాలకు ఆస్కారం లేదు. ఇందులో చర్మానికి పూర్వ వర్ణాన్నిచ్చే మెలనిన్ ఉత్పత్తిని పెంచే మూలికలతో ఈ ఔషధం తయారు చేయబడింది.
krishna

లూకో కిట్ గురించి..


ఇందులో మూడు రకాల ట్యాబ్లెట్లు ఉంటాయి. వీటిని ఉదయం సాయంత్రం భోజనం తర్వాత వేసుకోవాలి. వీటితో పాటు చర్మం మీద పై పూతగా వాడే కలర్‌కాట్ ఎల్ మిక్స్ ద్రావణం కలయికతో చర్మానికి సహజ వర్ణాన్ని ఇచ్చే ఔషధం తయారు చెయ్యబడింది. సహజ వర్ణం పోయి తెల్ల మచ్చలు ఏర్పడిన చోట ఈ ద్రావణాన్ని పూతగా రాసి 10- 15 నిమిషాల పాటు ఎండలో కూర్చోవాలి. రోజూ ఉదయం సాయంత్రం ఈ మందును ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

385
Tags

More News

VIRAL NEWS