లేలేత సొగసులు!


Fri,April 19, 2019 02:03 AM

అన్ని వేళల్లో.. అన్ని సందర్భాలకు.. ముదురు రంగులే బాగుంటాయనుకోవడం పొరపాటు.. రిసెప్షన్లు.. ఇతర పార్టీల్లో.. ఇప్పుడు లేత రంగులే రాజ్యమేలుతున్నాయి.. వాటితో లాంగ్ గౌనులు.. అందరిలోనూ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలుపుతాయి.. ఆ ైస్టెలిష్ సొగసులను మీరూ చూడండి..
Fashan
1. పార్టీల్లో ప్రత్యేకంగా ఉండేందుకు ఈ డ్రెస్ వేయాల్సిందే! పీచ్ కలర్ గోల్డెన్ ఆప్లిక్, స్టడ్ వర్క్ వచ్చిన నెట్ ఫ్యాబ్రిక్ ఇది. ఆర్గంజా మెటీరియల్ మీద హెవీగా జరీ వర్క్ చేయించాం. వన్ షోల్డర్‌గా ఇచ్చి.. దాన్ని కుచ్చులు కుచ్చులుగా ఇవ్వడంతో డ్రెస్ లుక్ మారిపోయింది.

2. క్రీప్ కేక పుట్టిస్తుంది. లైట్ స్కై బ్లూ కలర్ లాంగ్ గౌన్‌ని సింపుల్‌గా డిజైన్ చేశాం. పైన క్రీప్ సిల్క్ మీద ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ చేయించాం. దీనికి థ్రెడ్, జరీని ఉపయోగించాం. పైన నెట్ స్టడ్స్ వచ్చిన మెటీరియల్‌ని అటాచ్ చేశాం. కోల్డ్ షోల్డర్స్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. రా

3. కుమారిలా మెరిసిపోయేందుకు ఈ డ్రెస్ వేయాల్సిందే! పీచ్ కలర్ సాఫ్ట్ నెట్‌తో లేయర్లుగా కింద వైపు డిజైన్ చేశాం. దానికి పీచ్ కలర్ రాసిల్క్‌ని బార్ లైన్‌గా వేసే సరికి అందంగా మెరిసిపోతున్నది. పైన కూడా నెట్ ఫ్యాబ్రిక్‌తో హాఫ్ షోల్డర్ గౌన్‌గా కుట్టాం. దాని మీద ఫుల్‌గా థ్రెడ్, జర్దోసీ, స్టోన్స్‌తో హెవీగా వర్క్ చేసేసరికి మరింత సూపర్‌గా కనిపిస్తున్నది.
Fashan1
4. లేలేత రంగులు మనల్ని ప్రత్యేకంగా చూపిస్తాయి. పౌడర్ బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ ఇది. పైన ఎంబ్రాయిడరీ వచ్చిన సిల్క్ మెటీరియల్‌ని అటాచ్ చేశాం. ఆర్గంజా స్లీవ్స్ మీద స్టోన్స్‌తో హెవీగా వర్క్ చేయించాం. ఇక కింద వైపు ఒకే లైను లేయర్‌గా కాకుండా.. డిఫరెంట్‌గా నెట్‌తో లేయర్లను కుట్టాం. వీటికి కూడా రాసిల్క్ మెటీరియల్‌ని అటాచ్ చేశాం.

5. లేత పసుపు రంగు గౌను ఇది. నెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశాం. పూర్తిగా డ్రెస్ మొత్తం చిన్న చిన్న స్టోన్స్‌ని అతికించడంతో పార్టీ లుక్ వచ్చింది. మధ్యలో ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన సిల్క్ మెటిరీయల్‌ని అటాచ్ చేశాం. జరీ, థ్రెడ్ వర్క్‌తో వచ్చిన ఈ మెటీరియల్ డ్రెస్ లుక్‌ని పూర్తిగా మార్చేసింది. రాసిల్క్ బార్డర్ దీనికి అదనపు ఆకర్షణ.

-అర్చితా నారాయణం
-బంజారాహిల్స్, హైదరాబాద్
-archithanarayanam@gmail.com

272
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles