లిప్‌స్టిక్ వాడకంలో మెళకువలు?


Fri,March 1, 2019 11:59 PM

ముఖం అందంగా ఉందంటే అందుకు కారణం పెదవులే. వీటి రంగును మార్చడానికి ఎక్కువగా మహిళలు లిప్‌స్టిక్‌లు వాడుతుంటారు. కానీ, లిప్‌స్టిక్‌తో లాభాలేంటి? నష్టాలేంటి? అనేవి అస్సలు పట్టించుకోరు. ఎవరెవరు ఎలాంటి లిప్‌స్టిక్ వాడాలో చూద్దాం.
lipstic
-తెల్లగా ఉండే మహిళలు ఆరెంజ్, ఎరుపు, బ్రౌన్ రంగు లిప్‌స్టిక్ వేసుకోవాలి. అలాగే లైట్ జెర్రీ కలర్ లిప్‌స్టిక్ కూడా ఎంచుకోవచ్చని బ్యూటీషియన్లు చెబుతున్నారు.
-పగటిపూట లేతగా, సాయంత్రం దట్టంగా లిప్‌స్టిక్ వేసుకోవాలి. సీజన్‌ను బట్టి లిప్‌స్టిక్ వాడాలి. ఎండాకాలం మామూలుగా, చలికాలం ఎక్కువగా, వర్షాకాలం మితంగా సరిపోయేంత లిప్‌స్టిక్ వాడొచ్చు.
-చలి, వేడిమికి పెదాలను పొడిబారకుండా కాపాడాలనుకుంటున్నారా? ముందుగా పెదాలకు కొబ్బరినూనె రాయాలి. పది నిమిషాల తర్వాత కాటన్‌తో తుడిచి లిప్‌స్టిక్ రాసుకుంటే ఎక్కువసేపు రంగు పోకుండా ఉంటుంది.
-ఒకసారి కొన్న లిప్‌స్టిక్‌ను ఆరు నెలల తర్వాత ఉపయోగించకూడదు. లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత పెదవులతో సరిచేయడం వంటివి చేయకూడదు. లిప్ లైనర్‌తో అవుట్ లైన్ వేసుకున్నాకే లిప్‌స్టిక్ వేసుకోవాలి.
-రాత్రి నిద్రించేముందు ముఖం కడుక్కోవాలి. తడి తుడిచిన తర్వాత ముఖం, పెదాలకి మాయిశ్చరైజర్ వాడాలి. దీంతో రాత్రి సమయంలో పెదాలు ఆరిపోకుండా తేమగా ఉంటాయి.

209
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles