లింఫోమా అంటే..?


Thu,February 7, 2019 01:44 AM

నా వయస్సు 48 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా నేను ప్లీహం పెరుగడం, పొట్టలో నొప్పి, గజ్జల్లో వాపు, జ్వరం, చలి, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం లక్షణాలతో బాధ పడుతున్నాను. ఈ లక్షణాలతో డాక్టర్‌ని కలిస్తే ఆయన కొన్ని పరీక్షలు చేసి మీరు లింఫోమాతో బాధపడుతున్నారని నిర్ధారించారు. దయచేసి లింఫోమా అంటే ఏమిటీ? దానికి చికిత్సా మార్గాలు తెలుపగలరు?
- కె. శేఖర్, బాచుపల్లి

COUNSELLIMG
లింఫోమా అనేది లింఫోసైట్‌లను ( తెల్లరక్తకణాలు) ఉత్పత్తి చేసే, నిల్వచేసే, తీసుకెళ్లి కణజాతులైన సిస్టమ్‌లో కలిగే క్యాన్సర్‌లు. లింఫోమా ప్రాథమికంగా రెండు రకాలుగా ఉంటుంది. హెడ్జ్‌కిన్స్ లింఫోమా, నాన్ హెడ్జ్‌కిన్స్ లింఫోమా. నొప్పి లేకుండా మెడలో, చంకలో లేద గజ్జల్లో వాపు, ప్లీహం పెరుగడం, పొట్టనొప్పి, జ్వరం, చలి, శక్తి లేకపోవడం, బరువు తగ్గడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివి మీకు ఉన్నాయని చెబుతున్నారు. కాబట్టి బాగా తినండి. ఒకేసారి ఎక్కువ భోజనం చేసే బదులుగా కొద్ది కొద్ది భోజనం ఎక్కువ సార్లు చేయండి. మీకు నోట్లో పుండ్లు ఉంటే మెత్తని ఆహారం తినండి. మసాలా ఆహారాలు తినకండి. బత్తాయి రసం తాగండి. ద్రవపదార్థాలు పుష్కలంగా తీసుకోండి. వ్యాయమాన్ని మీ డాక్టర్ ఓకే అంటే చేయండి. తగినంత విశ్రాంతి తీసుకోండి, నిద్రపోండి. మళ్లీ కలుగుతుందేమోననే భయం ప్రధాన ఆందోళన. ఒకవేళ కుంగుబాటు లేదా ఆత్రుత ఎక్కువ కాలం ఉంటే మీ డాక్టర్‌ను సంప్రదించండి. లింఫోమా చికిత్స తర్వాత.. మీ లిపిడ్‌లను, థైర్పాడ్‌ని, కాలేయం, మూత్రపిండాలను క్రమ పద్ధతిలో చెక్ చేయించుకోవడం ముఖ్యం. క్లినికల్ రొమ్ము పరీక్ష, ఎముకల సాంద్రత స్కాన్, పాప్ పరీక్షలు, కోలొరెక్టల్ స్క్రీనింగ్‌లు, ప్రోస్టేట్ పరీక్షలు కూడా చేయించాలి. రక్త పరీక్ష, బయాప్సీ, ఎముక మూలగ పరీక్ష, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, ఎక్స్‌రే, టామోగ్రఫీ, ఎంఆర్‌ఐ, పొజిట్రాన్ ఎమిషన్ అనే పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. క్షుణ్ణంగా వైద్య పరిశీలన తర్వాత మీ శరీరంలో లింఫోమా వ్యాప్తి ఏ మేరకు ఉందో మీ ఫిజిషియన్‌కి తెలుస్తుంది. మీకు ఏదోరకమైన లింఫోమా ఉంది, లింఫోమా దశ అంటే ఏ ప్రాంతాలు దెబ్బతిన్నాయి. మీ సాధారణ ఆరోగ్యం, అంటే మీరు ఇప్పుడు క్రియాశీల చికిత్స చేయించుకోవాల్సిన పని లేదని అర్థం. అయితే మీ క్యాన్సర్ పెరుగుతుందని పరీక్షల్లో నిర్ధారణ అయితే చికిత్సలు పొందాల్సి ఉంటుంది.

-డాక్టర్ అనిల్ అరబండి
-హెమటో ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్

657
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles