లింగవివక్షపై నిలదీత


Thu,January 31, 2019 12:25 AM

లింగ వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. అందులోనూ ప్రముఖ లైబ్రరీలో అని ఓ బాలిక సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టిస్తున్నది.
gender-discrimination
దక్షిణ ముంబైలో ప్రముఖ ఆసియా సొసైటీ గ్రంథాలయం ఉన్నది. ఇందులో టాటా ఇన్సిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీసీసీఎస్) విద్యార్థులు కేవలం మహిళల విభాగం మాత్రమే ఉపయోగించాలనే నిబంధన ఉన్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇన్సిట్యూట్‌కు చెందిన అర్బన్ పాలసీ విద్యార్థితో కలిసి అన్నా బ్రిటాస్ అనే బాలిక ఆ గ్రంథాలయానికి వెళ్లింది. అక్కడ ఆడవారికి కేటాయించిన స్థలాన్ని చూసి ఆందోళన చెందింది. మహిళల కోసం కేటాయించిన విభాగం చాలా చిన్నగా ఉన్నది. చారిత్రాత్మక గ్రంథాలయంలో ఇలాంటి వివక్ష ఉండడం తనను కలచివేసిందని, తాము చారిత్రాత్మక స్థలాలకు వెళ్లినప్పుడు ఎదురైన వివక్షల్లో ఇదే మొదటిదని బాధపడింది. విశాలమైన లైబ్రరీలో కేవలం తొమ్మిదో వంతు మాత్రమే ఆడవాళ్లకు కేటాయించడమేంటని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అంతేకాదు మరింత విస్తరించాలని ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతున్నది.

185
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles