లాంగ్ ఫ్రాక్‌ కిరాక్


Sat,March 9, 2019 12:56 AM

ఆడవాళ్లకు డ్రెస్‌ల్లో ఆప్షన్లు బోలెడు.. పండుగలకు ఒకలా.. ఫంక్షన్లకు మరోలా.. చీర కట్టుతో.. చుడీదార్.. లంగాఓణీ.. ఇలా లిస్ట్ తీస్తే చాంతాడంత అవుతుంది.. ఈ మధ్యకాలంలో అన్నింటినీ మించి.. లాంగ్‌ఫ్రాక్‌ల రాజ్యం నడుస్తున్నది.. కాలేజ్‌కి వెళ్లే అమ్మాయిల దగ్గర నుంచి.. ఆఫీసులకి వెళ్లే పడుతుల వరకు.. హాట్‌ఫేవరెట్‌గా మారాయి ఈ లాంగ్ గౌనులు.. కిరాక్ అనిపించే ఆ గౌన్ల సోయగాలపై ఓ లుక్కేయండి..

పింక్ కలర్ బ్రొకెడ్ బెనారస్ చీరను ఇలా లాంగ్ ఫ్రాక్‌లా కుట్టాం. పైగా అంచును బార్డర్‌లా, బాక్స్ ప్లీట్స్ ఇవ్వడంతో మరింతు బాగా కనిపిస్తున్నది. దీని మీద సిల్వర్ జరీ బుటీస్ వచ్చాయి. కొంగుని పైన అటాచ్ చేశాం. వెనుక ముందు భాగంలో వీ నెక్ ఇవ్వడంతో డ్రెస్ అందం రెట్టింపు అయింది.
PINK
కొత్తగా ట్రై చేయాలనుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ చాయిస్. స్కర్ట్ మిక్స్‌డ్ అనార్కలీ మోడల్‌లగా ఈ డ్రెస్ డిజైన్ చేశాం. ఎర్రని క్రేప్ టెక్చర్ ఫ్యాబ్రిక్‌ని బోట్ అండ్ డీప్ నెక్‌తో డిజైన్ చేశాం. ఎల్‌బో హ్యాండ్స్.. ప్రిన్సెస్ కట్‌తో లాంగ్ ఫ్రాక్ చూడముచ్చటగా కనిపిస్తున్నది. మధ్యలో స్లిట్ ఇచ్చాం. దీన్ని కవర్ చేసేలా మళ్లీ హెవీగా మగ్గం వర్క్ చేయడంతో సూపర్ లుక్ సొంతమైంది.
PINK1

ఎర్రని చెక్స్ ప్యాటర్న్ ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌ని పైన ఎంచుకున్నాం. ఒక వైపు పోట్లీ బటన్స్‌తో హైలైట్ చేశాం. మరో వైపు కొంగ మోటీవ్ వర్క్ చేశాం. హ్యాండ్స్‌కి మధ్య కీ హోల్ ఇచ్చాం. దాని చుట్టూ కూడా హెవీగా మగ్గం వర్క్ చేయడంతో ైస్టెలిష్‌గా కనిపిస్తున్నది. కింద టై అండ్ డై ఫ్యాబ్రిక్‌ని లాంగ్ లెంగ్త్‌గా ఉండేలా అటాచ్ చేయడంతో సూపర్‌గా ఉంది.
PINK2
సింపుల్ అండ్ స్వీట్‌గా మెరిసిపోయేందుకు ఈ డ్రెస్ వేయాల్సిందే! పీచ్ కలర్ క్రేప్ శాటిన్ ఫ్యాబ్రిక్ ఇది. దీన్ని అనార్కలీ మోడల్‌గా కుట్టాం. నెక్‌ని సైడ్ వీ నెక్‌గా ఇచ్చి బ్లూ కలర్ రాసిల్క్‌తో పైపింగ్ చేశాం. పైన మొత్తం మెషీన్ ఎంబ్రాయిడరీతో నింపేశాం. స్లీవ్స్ మీద కూడా ఇదే వర్క్ కంటిన్యూ చేశాం. ప్యూర్ ఇక్కత్ సిల్క్ బార్డర్ డ్రెస్‌కి హైలైట్‌గా నిలిచింది.
PINK3

niharika


నిహారికా రెడ్డి
శ్రీ వైదిక్ డిజైనర్ స్టూడియో
శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్
ఫోన్ : 040-44008089
https://www.facebook.com/sreevaidiki

1266
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles