రొమాంటిక్ స్పాట్స్ @ హైదరాబాద్


Wed,February 13, 2019 12:39 AM

ప్రేమికుల రోజుకు ముందే ప్లాన్ చేసుకుంటారు కదా? మరి హైదరాబాద్‌లోనే కొన్ని రొమాంటిక్ స్పాట్స్ (రెస్టారెంట్స్) ఉన్నాయి. ఈ వాలెంటైన్స్ వాటిల్లో జరుపుకోండి.
Romantic-Places
ఓవర్ ద మూన్ బ్రూ కో: ఓల్డ్ ముంబై హైవే పక్కన గచ్చిబౌలిలో ఉంది. చంద్రుడు రాత్రి మాత్రమే కాదు పగలు కూడా కనిపిస్తాడు అని ఇక్కడ గడిపితే చెప్పొచ్చు.


గుఫా: ఓల్డ్ గాంధీ మెడికల్ కాలేజీ పక్కన బషీర్‌బాగ్‌లో ఉంది. ఇది గుహలా ఉంటుంది. నైన్టీస్ హిట్‌సాంగ్స్ వస్తుండగా డిమ్‌లైట్స్ మధ్యన రొమాంటిక్‌గా కనిపిస్తుంది.


ది వాటర్ ఫ్రంట్: నెక్లెస్‌రోడ్‌లో ఉంది. దీంట్లో కూర్చుంటే హుస్సేన్‌సాగర్ రంగు లైట్ల మధ్యన హొయలొలుకుతూ కనిపిస్తుంది. హైదరాబాదీ వంటకాలు మాత్రమే ఉంటాయి.


జాఫ్రాన్ ఎగ్జోటికా: బంజారాహిల్స్‌లోని హార్ట్‌సిటీలో ఉంది. దీంట్లోకి అడుగుపెడితే ఆకాశం మధ్యలో కూర్చున్న అనుభూతి కలుగుతుంది.


చౌమహల్లా ప్యాలెస్: మోతీగల్లీలో ఉంది. ఇది నిజాం నవాబుల అధికారిక నివాసం. రాజసానికి నిదర్శనం ఇది. నవాబుల కాలంలో ఉన్న అనుభూతి కలుగుతుంది.


అనంతగిరి హిల్స్: వికారాబాద్‌లో ఉంది. నీటి పరవళ్లు.. అటవీ సౌందర్యం కనువిందు చేస్తుందిక్కడ. నగరానికి దూరంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇది మంచి స్పాట్.


ఆటమ్ లీఫ్ కేఫ్: జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి సమీపంలో ఉంది. రెస్టారెంట్ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. ఇక్కడ ఉంటే ఏదో ఏకాంతంలో ఉన్న అనుభూతి కలుగుతుంది.


తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్: ఫలక్‌నుమాలో ఉంది. 32 ఎకరాలలో విస్తరించివుంది. నవాబుల మరొక అధికారిక నివాస ప్రదేశం ఇది. ఫౌంటేన్లు.. అద్దాల గదుల్లో ఉన్నట్లుంటుంది.

422
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles