రైలు నుంచే చూడొచ్చు


Fri,March 8, 2019 01:58 AM

ట్రెయిన్‌లో జర్నీ చేస్తున్నారా? ఎలాంటి ఫుడ్ కావాలనుకుంటున్నారు? క్వాలిటీ, క్వాంటిటీ మీ కళ్లతో చూడాలనుకుంటున్నారా? డోంట్ వర్రీ..
bookapp
రైలు ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటి ఆహారానికే ప్రాధాన్యం ఇస్తారు. రైళ్లలో దొరికే ఆహారం విషయంలో ఇప్పటి వరకు చాలా రకాల వార్తలు వచ్చాయి. అది దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే కొత్త ప్యాకేజీని ప్రారంభించింది. అందుకోసం ఒక వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. రైల్లో కూర్చుని మీరు తినాలనుకుంటున్న ఆహారాన్ని చూడొచ్చు. కిచెన్‌లో వండుతున్నప్పుడు చూసే సరికొత్త వెసులుబాటును రైల్వేశాఖ కల్పించింది. పొగరహిత పొయ్యిలు, చిమ్నీలు, అతిపెద్ద ఫ్రీజర్స్ వంటి సదుపాయాలతో కిచెన్ సెటప్‌ను ఏర్పాటు చేశారు. రైళ్లలో నాణ్యమైన ఆహారం దొరకదన్న అభిప్రాయాన్ని కొట్టి పారేసేందుకు, ప్రభుత్వం మీద విశ్వాసం కల్పించేలా ఈ యాప్ అప్లికేషన్, వెబ్‌సైట్ వారధిలా పనిచేయనున్నాయి. రైల్వే కిచెన్‌లు పరిశుభ్రంగా ఉండవన్న సందేహాన్ని, ఊహాగానాలను దూరం చేయడానికి పారదర్శకంగా తీసుకొని ఈ కార్యక్రమానికి ప్రాణం పోశారు. మీకు కావాల్సిన ఆహారాన్ని, వండుతున్న విధానాన్ని, ప్యాకింగ్ వంటి అన్ని అంశాలనూ నేరుగా ఆన్‌లైన్‌లో చూడొచ్చు. దీనికి సంబంధించిన యాప్‌ను సోమవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ యాప్‌లో కేవలం ఐఆర్‌సీటీసీ కిచెన్‌లకు సంబంధించిన సమాచారంతో పాటు రైళ్ల రాకపోకలు, టికెట్ల వివరాలను కూడా తెలియజేస్తుంది. ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నది.

614
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles