రైతుల కోసం రిటైర్డ్ టీచర్ ఆలోచన..


Sat,March 16, 2019 12:01 AM

ఉద్యోగ విరమణ పొందిన టీచర్ ఇంటి పట్టున ఉండకుండావ్యవసాయంవైపు దృష్టి పెట్టింది. పసుపు పంటలో కొత్త ఒరవడిని అక్కడి రైతులకు పరిచయం చేసింది.
megalaya
మేఘాలయాలోని జైనంతియా జిల్లాకు చెందిన ట్రినితీ సాయో ఉపాధ్యాయ వృత్తి నుంచి విరమణ తీసుకుంది. తర్వాత చుట్టు పక్కల గ్రామాల్లో వ్యవసాయం మీద ఆసక్తి చూపింది. 16 ఏండ్ల క్రితమే ఆమె పసుపు పండించడం నేర్చుకుంది. పూర్వీకుల వల్ల ట్రినితీకి పసుపు పంటపై పట్టు ఉండేది. ఇప్పుడు రైతులు పండిస్తున్న విధానాలు పూర్వకాలపు విధానాలకు భిన్నంగా ఉండడాన్ని గమనించింది. ఈ అధునాతన విత్తనాల వల్ల, రసాయనాలతో పంట పండించడం ద్వారా దిగుబడి కోల్పోతున్న పరిస్థితిని గమనించింది. దీన్ని మార్చడానికి తాను లక్‌డోంగ్ అనే రకమైన పసుపును రైతులతో ప్రయోగాత్మకంగా పండించి విజయం సాధించింది. ఈ పసుపు అధిక దిగుబడిని సాధిస్తుంది. దీనికి కాన్సర్‌ను నిరోధించే లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ పసుపును చుట్టుపక్కల గ్రామాల్లో 900 మంది రైతులు పండిస్తున్నారు. ముప్ఫై టన్నులకు పైగా సాగవుతున్నది. ఈ సాగులో సాయం కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేసింది ట్రినితీ. సాగులో మెళకువలు, పద్ధతులు, జాగ్రత్తలను ఈ గ్రూపులు పాటిస్తాయి. విత్తన శుద్ది, పసుపు కొమ్ములు కోయడం, విక్రయం వీటి అధ్వర్యంలోనే జరుగుతున్నది. దీంతో దళారీ వ్యవస్థకు దూరంగా ఉండగలుగుతున్నారు. లాకడాంగ్ పసుపు విధానాన్ని మరింత అభివృద్ధి చేసి 2023 కల్లా సుమారు 50వేల టన్నుల పసుపు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ట్రినితీ ముందుకు సాగుతున్నది.

726
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles