రెండేండ్ల బిడ్డ కోసం సేంద్రియ బాట


Wed,March 6, 2019 02:44 AM

smitha-kamath
రసాయన కాస్మొటిక్స్ వాడటం వల్ల కూతురికి ఎలర్జీ వచ్చింది. రసాయన సహిత ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. దీన్ని చూసి చలించిన తల్లి వాటికి గుడ్ బై చెప్పింది. అప్పటి నుంచి బిడ్డకు కావాల్సినవి అన్నీ ఇంట్లోనే సహజ సిద్ధంగా తయారు చేయటం ప్రారంభించింది. వాటిని ఇతరులకు కూడా అందించింది.
మార్కెట్‌లో దొరికే వస్తువులన్నీ రసాయనాలతోనే తయారవుతాయి. ఇవి వాడితే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితినే ఓ తల్లి ఎదుర్కొంది. మార్కెట్‌కు వెళ్లకుండానే ఇంట్లో తయారు చేయటం ప్రారంభించింది. బెంగళూరుకి చెందిన ఐటి నిపుణురాలు స్మితా కామత్‌కి రెండేండ్ల పాప ఉంది. అయితే పాపకు సుదీర్ఘంగా బయటి కాస్మొటిక్స్ వాడటం వల్ల చర్మవాధులు వచ్చాయి. ఈ సమస్యకి కారణమేంటని ఆలోచించింది. చర్మానికి వాడే కాస్మొటిక్సే దీనికి కారణమని తెలుసుకుంది. దీంతో కెమికల్ ప్రాడక్ట్స్ వాడకాన్ని ఆపింది. సీజన్‌లో వచ్చే కూరగాయల్ని సేంద్రియ పద్ధతిలో పండిస్తారు. ఈ పద్ధతిలో కాకుండా వచ్చేవన్నీ రసాయనిక ఎరువులతో పండించినవే అని తెలుసుకుంది. రాగి, చిరుధాన్యాలు, రెడ్ రైస్‌తో తయారు చేసిన పదార్థాలను పాపకి ఆహారంగా పెట్టింది. దీంతో పాప ఆరోగ్యంలో కూడా చాలా మార్పు వచ్చింది. పాప ఆరోగ్యం కోసం బెంగళూరికి దగ్గర్లో ఉండే చెన్నపట్నంలోని దేవరకాడు ఫార్మింగ్ ఫ్రాజెక్ట్, కమ్యూనిటీ సెంటర్‌ని మొదలుపెట్టింది స్మితా. దేవరకాడు స్థానిక రైతులను రసాయనాలు లేని పంటలను ప్రోత్సహిస్తున్నది. ప్లాస్టిక్ బ్రష్‌లకు బదులుగా వేపపుల్లతో వాడుతున్నది. స్మితా అమ్మమ్మ సలహాలతో కాజల్, పర్ఫూమ్‌ల తయారీ వాడే మెడిసిన్‌కి బదులుగా మూలికలతో తయారుచేస్తున్నది. బావిలో నీరు కుండలో నింపి వాటినే తాగమని సూచిస్తున్నది స్మితా. వీరి ప్రయత్నం బెంగుళూరు నుంచి చెన్నై, కోయంబత్తూర్, గురుగ్రామ్, మదురై వరకు విస్తరించింది. సబ్బు, షాంపూ, బాడీ బట్టర్స్, హ్యాండ్ వాష్, ఫ్లోర్ క్లీనర్స్ తయారీకి వాడే కెమికల్స్‌కి బదులుగా సహజ పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఈ టీమ్‌లో 24 మంది సభ్యులున్నారు. కమ్యునిటీ అందిస్తున్న ప్రాడక్ట్స్‌‌లతో పిల్లలు, పెద్దలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని గ్రామంలోని ప్రజలకు వాటిపై అవగాహన పెంచుతున్నది స్మితా.

925
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles