రెండు కలుస్తాయిక్కడ!వింత ప్రదేశం


Thu,January 24, 2019 11:51 PM

Two-Clashing
రెండు సముద్రాలు కలుస్తాయి. వాటి మధ్య మీరు నిలబడొచ్చు. వావ్.. ఇప్పుడే వెళ్లాలనిపిస్తుంది కదూ! చూస్తే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సముద్రాల్లో ఇలాంటి ప్రదేశాలు చాలా తక్కువున్నాయి. రెండు సముద్రాలు కలిసే చోట ఇసుకలో నిల్చుని చూస్తే వచ్చే మజాను అక్షరాల్లో వర్ణించలేం. ప్రకృతి ప్రేమికులైతే ఆ ప్రదేశాన్ని వదిలి ఉండలేరు. డెన్మార్క్‌లోని స్కాగెన్ నగరానికి సమీపంలో గ్రానెన్ పేరుతో ఉన్న ప్రాంతం ఇది. దీని చుట్టుపక్కల సముద్రపు జంతువులు, తీర ప్రాంతాల్లో తిమింగలాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇదొక వైవిధ్యమైన ప్రకృతి దృశ్యంగా ప్రసిద్ధిగాంచింది. కిలోమీటర్ల పొడవు ఇసుక, సముద్ర తీరం ఉన్న ఈ ప్రాంతం లక్షల్లో వచ్చే పర్యాటకులతో ఎప్పుడూ కళకళలాడుతుంటుంది.

797
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles