రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోచికిత్స


Thu,July 6, 2017 01:09 AM

రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక ఆటోఇమ్యూన్ సమస్య. శరీరంలోని సొంత నిరోధక వ్యవస్థ కీళ్ల కణజాలం మీద దాడి చేయడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. మనదేశంలో సమారు 7 మిలియన్ల ప్రజలు రుమటాయిడ్ బాధపడుతున్నారు. ఇది పురుషుల కంటే స్త్రీలలో మూడు రెట్లు అధికంగా కనిపిస్తుంది.

అధునాతన హోమియో వైద్యంతో ఈ వ్యాధిని సమర్థవంతంగా నయం చెయ్యవచ్చు. సూక్ష్మీకరణ పద్ధతిలో తయారు చేసిన హోమియోమందులు ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా పూర్తిగా నయం చెయడం జరుగుతుంది.

ఇది చాలా నెమ్మదిగా పెరిగే సమస్య. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో కనబడుతుంది. మొదట చిన్న చిన్న కీళ్లలో, తర్వాత పెద్దకీళ్లలో సమస్య మొదలవుతుంది. కీళ్లలోని సైనోవియమ్ పొర తర్వాత నెమ్మదిగా కార్టిలేజ్ దెబ్బతింటుంది. ఫలితంగా కీళ్ల ఆకారం, అమరిక కోల్పోయి విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ వ్యాధి కొందరిలో కీళ్లపై మాత్రమే కాదు ఇతర అవయవాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రక్తనాళాలు, చర్మం వంటి వాటి మీద ష్పభావాలు కనిపిస్తాయి.

ఎవరిలో..?

కీళ్ల వాతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ, సాధారణంగా పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న పిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని జువైనల్ ఆర్థరైటిస్ అని అంటారు.

కారణాలు

మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని కణాలు వ్యతిరేకంగా పనిచేసి ఆరోగ్యవంతమైన కణాలపై దాడి చేస్తాయి. ముఖ్యంగా కీళ్లలోని సైనోవియమ్ పొరపై ప్రభావితం చేయడం వల్ల వస్తుంది. సాధారణంగా మన శరీరంలో తెల్లరక్తకణాలు వ్యాధి నిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి బాక్టీరియా, వైరస్ మరియు ఇతర పరదీయ పదార్థాల నుంచి నిత్యం కాపాడుతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులలో తెల్లరక్త కణాలు కీళ్ల చుట్టూ ఉండే సైనోవియమ్‌లోకి వెళ్లి ప్రొటీన్లు విడుదల చేస్తాయి. దీనివల్ల సైనోవియమ్ పొర మందంగా మారి క్రమంగా కీళ్ల లోపలి ఎముకలు, కార్టిలేజ్ ఇన్‌ఫ్లమేషన్‌కు గురికావడం వల్ల కీళ్ల అమరికలో మార్పు వచ్చి వైకల్యానికి దారి తీస్తుంది. జన్యుపరమైన, జీవన శైలి పరమైన కారణాల వల్ల కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది.

లక్షణాలు

కీళ్ల వాపు, నొప్పి, చేతితో తాకితే వేడిగా ఉండడం, ఉదయం లేవగానే కీళ్ల కదలికలు బాధాకరంగా ఉండడం, బిగుసుకు పోవడంతో పాటు ఈ లక్షణాల తీవ్రత ఎప్పుడూ ఒకే తీరుగా కాకుండా పెరుగుతూ తగ్గుతూ ఉండవచ్చు. అంతేకాకుండా రెండు వైపులా ఒకే రకం కీళ్లు ప్రభావితం కావడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వీటికి తోడు రక్తహీనత, ఆకలి సరిగా లేకపోవడం నిసత్తువ, బరువు తగ్గడం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలతో పాటు మోచేయి, మనికట్టు వంటి కీళ్లలో చర్మం కింద చిన్నచిన్న బుడిపెలు (రుమటాయిడ్ నాడ్యూల్స్) ఏర్పడవచ్చు.

నిర్ధారణ

సీబీపీ, ఈఎస్‌ఆర్, ఆర్‌ఏ ఫ్యాక్టర్, ఏఎన్‌ఏ, యాంటి సీపీసీ, ఎక్స్‌రే, ఎమ్‌ఆర్‌ఐ, మొదలైన పరీక్షలు వ్యాధి నిర్ధారణకు తోడ్పడుతాయి.

హోమియోకేర్ చికిత్స

చాలా రకాల ఆటోఇమ్యూన్ జబ్బులు సైకోసొమాటిక్ డిజార్డర్స్ కిందికి వస్తాయి. అన్ని రకాల సైకోసొమాటిక్ డిజార్డర్స్‌కి హోమియోలో చక్కని పరిష్కారం లభిస్తుంది. అందులో ఒకటైన రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి కూడా హోమియోలో సంపూర్ణ చికిత్స ఉంది. ఇతర చికిత్సా విధానాల్లో కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభ్యమవుతుంది. కానీ హోమియోపతిలో పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. అయితే ఈ మందులను రోగి వ్యక్తిగత లక్షణాలు, స్వరూప స్వభావాల ఆధారంగా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది.
drmohan

324
Tags

More News

VIRAL NEWS