రుతుక్రమ సమాజ్‌బంధ్!


Fri,December 28, 2018 01:55 AM

ట్రైబల్ ఏరియాల్లో నివసించే గిరిజన మహిళల పరిస్థితి ఏంటి? రుతుక్రమం వంటి సమయాల్లో ఉపయోగించడానికి కనీసం నాప్‌కిన్స్ అయినా ఉన్నాయా? అని ఆలోచించాడు ఓ వ్యక్తి.
napkins
రుతుక్రమం సమయంలో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికోసం సమాజ్‌బంధ్ సంస్థ ఏర్పాటుచేశాడు పూణెకు చెందిన సచిన్. పాత బట్టలను సేకరించి వాటితో సానిటరీ ప్యాడ్స్ తయారుచేసి అందజేస్తున్నారు. సచిన్‌కు ఈ ఆలోచన రావడానికి ఓ కారణం ఉన్నది. సచిన్ వాళ్ల తల్లికి గర్భాశయ సమస్య ఉండేది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేసి గర్భాశయం తొలిగించారు. అది కూడా రుతుక్రమం సమయంలో. సచిన్‌కు సానిటరీ ప్యాడ్స్ గురించి సరిగా తెలియదు. చివరి సమయంలో తెలిసినా వాటిని కొనేంత డబ్బు కూడా లేని దయనీయ పరిస్థితి వాళ్లది. ఏం చేయాలో తోచలేదు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కళ్లముందే కనిపించేసరికి తీవ్రంగా ఆలోచించాడు సచిన్. రుతుక్రమం సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరింపజేయాలనుకున్నాడు. ముఖ్యంగా ఎలాంటి సౌకర్యాల్లేని గిరిజన మహిళలను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతో సానిటరీ ప్యాడ్స్‌ని తయారుచేయడం మొదలుపెట్టాడు. మహిళలకు అవగాహన కలిగించి మంచి టీమ్ ఏర్పాటుచేసుకున్నాడు. పాతబట్టలుంటే వారికి పంపించాల్సిందిగా ఊరూరా ప్రచారం నిర్వహించాడు. ఒక్కోసారి సచినే ప్రతి గడపకి వెళ్లి పాతబట్టలుంటే ఇవ్వండని అడిగి తీసుకువచ్చేవాడు. అలా రెండువేల ఇండ్లకు తిరిగిన సచిన్‌ను చాలామంది చాలా రకాలుగా అన్నారు. ఐనా వాటిని పట్టించుకోకుండా నాప్‌కిన్స్ తయారీలోనే నిమగ్నమయ్యాడు. అయితే నాప్‌కిన్స్ కొనడానికి అక్కడి మహిళలు సిగ్గుపడేవారు. అందుకోసం మహిళల వలంటీర్స్‌ను నియమించాడు. వాటిని ఎలా వాడాలో కూడా అవగాహన కల్పిస్తున్నారు.

553
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles