రిస్కులపై కన్నేసి ఉంచండి


Sat,March 2, 2019 12:09 AM

కుటుంబంలో ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే, ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి కుటుంబ సభ్యులకు చాలా సమయం పడుతుంది. ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. చనిపోయిన వ్యక్తి లోటును పూడ్చుకోవడం ఆ కుటుంబ సభ్యులకు పెద్ద భారమే. నిజానికి అది పూడ్చలేని నష్టం. వ్యక్తి చనిపోతే కలిగే ఆర్థిక నష్టాన్ని బీమా పరిహారం వంటి వాటితో కొంత వరకు పూడ్చుకోవచ్చు. కానీ, మానసిక కష్టాన్ని, వేదనను అధిగమించడం అంత సులువు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆ మానసిక గాయాన్ని తగ్గించి మనల్ని కొంతమట్టుకు కుదుటపరిచే శక్తి ఒక్క కాలానికే ఉంది. కాలం మనిషికున్న అతి పెద్ద స్వాంతన, గొప్ప ఓదార్పు. గాయాలకు, కష్టాలకు అదే ఒక పెద్ద ఔషధం.
risk

మార్కెట్‌లో మదుపు (ఇన్వెస్టింగ్)కు కూడా అదే సూత్రం వర్తిస్తుంది. మదుపరులు నష్టపోయినప్పుడు అది వాళ్ల మానసిక ైస్థెర్యాన్ని బాగా దెబ్బ తీస్తుంది. పెట్టుబడులపరంగా అసలు నిజాలను అది వక్రీకరిస్తుంది. నష్టాలు ఏవైనా బాధాకరమే. అయితే ఆ బాధ నుంచి గట్టెక్కడానికి కాలం ఒక్కటే సమాధానం. ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు పెట్టుబడులపై వాళ్లకున్న అంచనాలు, లెక్కలు అన్నీ తలకిందులవుతాయి. తట్టుకోలేని మానసిక వేదన వాళ్లను అతలాకుతలం చేస్తుంది.
ఆస్పత్రి పాలై వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి కుటుంబంపై ఆ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్ని నెలల పాటు ఆ కుటుంబం సజావుగా నడువలేని పరిస్థితి ఉంటుంది. అదే రీతిలో చేసిన మదుపు తప్పుగా తేలి నష్టాలను మిగిల్చితే ఆ మదుపు చేసిన వ్యక్తలు దానికి ఒకింత కుంగిపోతారు. ఇక అప్పటి నుంచి అలాంటి నష్టం జరుగకుండా ఉండాలంటే ఏం చేసి ఉండాల్సింది? అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించడం వల్ల సమయం వృధా అవుతుందే కానీ ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు. నిజానికి ఈ ఆలోచనా ధోరణి వల్ల వాల్లు భవిష్యత్‌లో కూడా తప్పుడు మదుపు నిర్ణయాలు తీసుకునే అవకాశాలే ఎక్కువ.

ఇంట్లో అందరికి ఇష్టమైన వ్యక్తి చనిపోయినప్పుడు మిగతా కుటుంబ సభ్యులు మరింత తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. కొన్నిసార్లు కొంతమందిలో అది అనారోగ్య జీవనశైలికి దారి తీస్తుంది. కొంతమందిలో చెడు అలవాట్ల పెరుగుతాయి. అదే విధంగా మదుపు పరంగా కూడా మనం సరైనదని గట్టిగా భావించి తీసుకున్న నిర్ణయం తప్పని తేలితే, అది మనలో ఒకింత ఆత్మన్యూనతా భావానికి దారి తీస్తుంది. మదుపు, పెట్టుబడులపరంగా అది మనల్ని మరిన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఏ మాత్రం లాభసాటి కాని అలాంటి నిర్ణయాల వల్ల మొత్తంగా మన మదుపు లేదా పెట్టుబడి ప్రణాళిక పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది.

మరి ఇలాంటి విపత్కర పరిస్థితులను మనం ఎలా ఎదుర్కోవాలి? నిజమే, ఇష్టమైన వారిని కోల్పోవడం బాధాకరమే. అలాగని మనల్ని కోల్పోకూడదు కదా? అలాగని ఏదో ఒక రీతిలో మనుగడ సాగించడం మాత్రమే కాదు... అనుకున్నట్టుగా హాయిగా బతకగలగాలి. అది జరగాలంటే మనం మనలో ఉండే మౌలికమౌన బలాన్ని కోల్పోకూడదు. మదుపు చేసేటప్పుడు తప్పులు చేయడం పెద్ద తప్పే. కానీ, అలాగని అంతటితో వదలేయకూడాదు. ఆశించే లక్ష్యాల దిశగా మన ప్రయత్నం, ప్రయాణం కొనసాగుతూనే ఉండాలి. దెబ్బ తిన్నంత మాత్రాన మొత్తంగా మన ప్రణాళిక ఆపేయకూడదు. జరిగిన నష్టాన్ని పూడ్చుకునే రీతిలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. స్పష్టమైన లక్ష్యాలు, రిస్కులపై సరైన అంచనాలతో ఒక నిర్దిష్ట రీతిలో మనకు అనువైన, సరైన మదుపు ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయాలి.

మదుపు విషయంలో చాలావరకు మన పెట్టుబడులపై వచ్చే రాబడులు లేదా లాభాలకు మాత్రమే మనం ఎక్కువగా ఆకర్షితులమవుతాం. అందులో ఉంటే రిస్కులను పెద్దగా పట్టించుకోం. నిజానికి రిస్కులనేవి ప్రతి పెట్టుబడిలోనూ అంతర్గతంగా ఇమిడి ఉంటాయి. అవి బయటికి కనపడినప్పుడు మాత్రమే మనకు నొప్పి తెలుస్తుంది. అందుకనే మదుపు చేసేటప్పుడు అందులో ఉండే రిస్కుల మీద ఓ కన్నేసి ఉంచాలి. మనం ఏ రకమైన రిస్కులను ఎంతవరకు భరించగలం అనేది ముందుగానే అంచనా వేసుకోవాలి.

ప్రణాళికాబద్ధంగా చేసిన పెట్టుబడులపై మనం అనుకున్న రీతిలో లాభాలు రాకున్నా లేక నష్టాలు వచ్చినా వాటిని రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ, రిస్కు మీద ఏ మాత్రం అంచనా లేకుండా తీసుకునే మదుపు నిర్ణయాలు మాత్రం మనల్ని కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తాయి. దీనివల్ల పెట్టుబడుల మీద నష్టాలు రావడం మాత్రమే కాదు... మార్కెట్‌లో మదుపు చేయాలనే ఉత్సాహాన్ని, స్పూర్తిని పూర్తిగా దెబ్బతీస్తుంది.

మదుపు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ఏమిటంటే.. మనం చేసే మదుపు లేదా పెట్టుబడికి స్పష్టమైన ఉద్దేశ్యం ఉండాలి. దానికి తగ్గట్టుగా సరైన పద్దతిలో ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. కొన్ని మ ధ్యంతర లక్ష్యాలను గుర్తించి పెట్టుకోవాలి. అప్పటి వరకు సాధించిన విజయాలను ఆనందించడానికి, కొత్త ఉత్తేజంతో మరింత చురుగ్గా ముందుకు సాగిపోవడానికి ఇది చాలా అవసరం. ప్రతి స్థాయిలోనూ రిస్కులను బేరిజు వేసుకుంటూ ఉండా లి. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు రిస్కులు, రాబడులు విశ్లేషించుకుంటూ మధ్య మధ్యలో అవసరమైన మేరకు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ స్థూలంగా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
naresh-kumar

241
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles