రికార్డు సృష్టించిన విజయం..


Mon,April 8, 2019 11:53 PM

ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో దేశవ్యాప్తంగా ఎందరో ర్యాంకులు సాధించారు. విజయం ఒక్కటే అయినా వారి నేపథ్యాలు, పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అలాగే 410 ర్యాంక్ సాధించిన శ్రీధన్య సురేశ్‌ది ఇంకా భిన్నమైన నేపథ్యం.

sreedhanya
కేరళలోని వాయనాడ్ జిల్లా పోజునాథ్ గ్రామానికి చెందిన కమల, సురేశ్ దంపతుల కూతురు శ్రీధన్య సురేశ్. తల్లిదండ్రులు ఉపాధి కూలీలు. కురిచాయల అనే గిరిజన తెగకు చెందిన పేద కుటుంబం వీరిది. శ్రీధన్య కోజిక్కోడ్‌లోని ఓ కళాశాలలో జువాలజీ, కాలకట్ యూనివర్సిటీలో అప్లయిడ్ జువాజీలో పీజీ చేసింది. ఆ సమయంలోనే సివిల్స్ సాధించాలనే లక్ష్యం పెట్టుకుంది. శ్రీధన్య చదువు పూర్తి అయ్యాక ట్రైబల్ డిపార్ట్‌మెంట్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా చేరింది. ఆ సమయంలో పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. కానీ తన లక్ష్యం సివిల్స్ కావడంతో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదులుకుంది. సివిల్స్ కోచింగ్ కోసం కేరళ ప్రభుత్వం ఎస్టీ సంక్షేమ శాఖ కోచింగ్‌కు కావాల్సిన ఆర్థిక సాయం చేసింది. దీంతో సివిల్స్ మీద దృష్టి సారించింది శ్రీధన్య. అనుకున్నట్టుగానే ఆ పరీక్షల్లో నెగ్గి 410 ర్యాంకు సాధించింది. దీంతో కేరళ నుంచి సివిల్స్‌కు ఎంపికైన మొదటి గిరిజన యువతిగా శ్రీధన్య రికార్డు సృష్టించింది. కేరళ సీఎం విజయన్, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, కమల్ హాసన్‌తో పాటు ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతూ సందేశాలు పంపారు.

294
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles