రాసిపెట్టే రోబో!


Fri,March 1, 2019 03:21 AM

పిల్లలను స్కూల్‌కు పంపించడమంటేనే పెద్ద ప్రహసనం. స్కూల్ యూనిఫాం వేసి రెడీ చేస్తున్నప్పటి నుంచి స్కూల్లో దిగబెట్టి వచ్చే వరకు అదో పెద్ద ప్రహసనం. అలాంటిది వారితో హోంవర్క్ చేయించడం ఇంకెంత కష్టమో ఆలోచించండి. చెప్తే వినే పిల్లలైతే సమస్యేం లేదు. మొండిఘటాలైతేనే సమస్యంతా! అలాంటి వారికోసం ఓ రోబో వచ్చింది. వివరాలివిగో..
robo
చైనాలో ఓ చిన్నారి స్కూల్ టీచర్లు ఇచ్చే హోంవర్క్ చేయలేక తెగ ఇబ్బంది పడిపోయేది. ఏం చేయాలా అని ఆలోచించి ఓ ఐడియా వేసింది. రోబోలు అన్ని పనులు చేస్తాయి కదా? మరి నా హోం వర్క్ చేసే రోబో దొరుకుతుందా.. అని అన్వేషణ మొదలుపెట్టింది. తన ప్రయత్నం ఫలించి ఓ రోబో దొరికింది. ఎంచక్కా ఆ రోబోను ఇంటికి తెచ్చుకుంది. వాళ్లమ్మకు రోబోను పరిచయం చేసింది. స్కూల్‌కు వెళ్లి రాగానే.. హోంవర్క్ అంతా రోబోకి అప్పజెప్పి తను ఎంచక్కా ఆడుకోవచ్చని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కానీ వాళ్లమ్మ అలాంటిదేం లేదని హుకూం జారీ చేసింది. నీ హోం వర్క్ రోబో చేస్తే.. నీకెలా చదువొస్తుంది? అని తిట్టిపోసింది. ఆ రోబోను తీసుకెళ్లి రోబో సినిమాలో రజినీకాంత్ పడేసినట్టుగా చెత్తబుట్టలో పడేసింది. ఇదంతా తెలిసిన టెక్నాలజీ ప్రియులు మాత్రం ఆ చిన్నారిని మెచ్చుకుంటున్నారు. స్మార్ట్‌గా హోం వర్క్ చేసుకునే పద్ధతిని కనిపెట్టిన ఆ చిన్నారిని శభాష్ అంటున్నారు. మెటల్ ఫ్రేమ్‌తో రూపొందించిన ఇలాంటి కాపీయింగ్ రోబోలు ఈ కామర్స్ మార్కెట్లో బోలెడన్ని దొరుకుతున్నాయి. ధర రూ. 8400 మాత్రమే. మీరు రాయాల్సిన రాతప్రతులన్నీ ఈ రోబోనే చేస్తుంది. కాకపోతే పిల్లల హోంవర్క్‌ను రోబోలతో చేయిస్తే వారికి చదువెలా అబ్బుతుందనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమేనేమో!

489
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles