రయ్యి రయ్యిమంటూ..


Fri,April 19, 2019 01:41 AM

పంతొమ్మిదేళ్ల రియా యాదవ్ తన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద ప్రయాణం ప్రారంభించింది. తండ్రి ఆ బండిని తనకు బహుమతిగా ఇచ్చాడు. బండి కొన్న తొమ్మిది నెలలకే వరల్డ్ రికార్డు బద్దలు కొట్టింది..
Riya-Yadav
టీనేజ్‌లో ఉండే అమ్మాయిల గోల్స్ అందరివీ ఉన్నతంగా ఉండకపోవచ్చు. కొందరి ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ఆ భిన్నత్వం మాత్రం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. రియా యాదవ్ కూడా అంతే. భిన్నంగా ఆలోచించింది. ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఒంటరి ప్రయాణాన్ని ప్రారంభించి విజయం సాధించింది. రియా ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఉమెన్స్ కాలేజ్‌లో పొలిటికల్ సైన్స్ చదువుతున్నది. వరల్డ్ హైవే మోటార్ పాస్‌ను గెలుచుకున్న అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. తన రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ బండిపై జూన్ 17న ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. జూలై1 తిరిగి రానున్నది. ఈ ట్రిప్‌కు సంబంధించిన విశేషాలను ఫేస్‌బుక్ ద్వారా తెలుసుకున్నానని చెప్తున్నది. ఇంతకుముందు ఈ రికార్డు ఇరవై ఏండ్ల ఆనం హసీం అమ్మాయి పేరు మీద ఉండేది. ఇటీవల డ్రైవింగ్ నేర్చుకున్న రియా డ్రైవ్‌చేస్తున్నప్పుడు కొంత భయపడేది. ట్రాఫిక్ ఉంటే కన్‌ఫ్యూజ్ అయ్యేది. సారా కశ్యప్ అనే ఆఫ్ రోడ్ ర్యాలీ రేసర్ రియాకు డ్రైవింగ్ విషయంలో చిట్కాలు చెప్పాడు. వచ్చే ఏడాది జరుగబోయే ద వరల్డ్స్ హైయెస్ట్ ర్యాలీ రైడ్ లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నది.
Riya-Yadav1

172
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles