రక్షణ కవచాలుగా పాదరక్షలు


Tue,February 26, 2019 01:31 AM

Sucharitha
కాళ్లజోళ్లకు మనిషి నాగరికతకు ఉన్నంత చరిత్ర ఉంది. త్రేతాయుగంలోనే శ్రీరాముని పాదరక్షలను భరతుడు తలపై మోసుకెళ్లిన విషయం చదివాం. దీన్నిబట్టి మనిషి కాళ్లకు చెప్పులు తొడగడం మొదలుపెట్టి ఎన్నాళ్లయిందో ఊహించుకోవచ్చు. పాదరక్షలు కాళ్లకు ఆభరణాల్లా కనిపించినా కటిక నేలపై వట్టి పాదాలతో నడవడం కష్టమే కాక, అవి కంది పోతాయి కాబట్టి, పాదాల్ని రక్షించే తొడుగులుగానూ వాటిని భావించాలి. మొదట్లో ఋషుల కాలంలో వట్టి జోళ్లుగా మాత్రమే ఉన్నా రాజరిక కాలం వచ్చేసరికి మొత్తం పాదంతోపాటు సగం వరకు కాళ్లను కప్పేసే దట్టమైన రక్షణ కవచాలుగా అవి మారాయి. యుద్ధ రంగంలో సైనికులకు ఇవి తప్పనిసరైనాయి.


అవి ఒరుసుకుపోకుండా లోన మెత్తని వస్త్రం (సాక్స్) తొడుక్కోవడం మొదలైంది. క్రీ.పూ.5,000 సంవత్సరాల నుంచే పాదరక్షలు ప్రజల సంస్కృతిలో భాగంగా ఉన్నట్టు ఆధునిక చరిత్ర చెబుతున్నది. ఈజిప్టు, గ్రీకుల నాగరికతల్లో ఆయా పరిసరాలు, వాతావరణాల రక్షణకు వాటిని తొడిగినట్లు తెలుస్తున్నది. మధ్యయుగం నాటికే ఎత్తు మడమల బూట్లు (high heels shoes) వచ్చేశాయి. 18వ శతాబ్దం కల్లా ఇవి గౌరవానికి, సంపదకు చిహ్నంగా మారినై. ఇవాళ్టికి అనేక రకాల చెప్పులు, షూలతో ఇది బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఎదిగింది. మొదట్నించీ ఎక్కువగా లెదర్ (తోలు)తో తయారైనా ఇప్పుడు ప్లాస్టిక్ లేదా రబ్బరుతోనూ తయారవుతున్నాయి.

262
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles