యూ ట్యూబ్ స్టార్స్!


Sat,December 22, 2018 11:29 PM

చిన్నపిల్లలు బయట ఆడుకునే రోజులు పోయాయ్.. ఏ ఆటైనా ఇంటర్ నెట్‌లోనే ఆడేస్తున్నారు. యూట్యూబ్‌లో వాళ్లకి కావాల్సిన వీడియోలు, పాటలు, కథలు పెట్టుకొని చూస్తున్నారు. ఇంకొంతమంది పిల్లలయితే ఫన్నీగా ఉండే వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడుతుంటారు. అలా వారికి వచ్చే కామెంట్లు, కాంప్లిమెంట్లు మరిన్ని వీడియోలు తీసేలా చేస్తుంటాయి. అలా వీడియోలు తీసి ఏకంగా ఒక చానెల్ పెట్టేస్థాయికి ఎదుగు తున్నారు. ఆ విధంగా చాలామంది పిల్లలు యూట్యూబ్ స్టార్స్‌గా పేరు తెచ్చుకుంటున్నారు.
Amar

అమర్..

అమర్ స్టార్ట్ చేసిన చానెల్ పేరు లెర్న్ విత్ అమర్. ఈ చానెల్‌ని ఎక్కువగా తెలంగాణ ప్రజలు చూస్తుంటారు. దీని ద్వారా ప్రపంచంలోని దేశాలు, ప్రపంచపటం, భౌగోళికతల గురించి తెలియజేస్తుంది. అమర్ చెప్పే పాఠాలు చాలామంది సులువుగా నేర్చుకుంటున్నారు. చెప్పేది చిన్నవాడైనా అతను చెప్పే విధానం మాత్రం అనుభవం ఉన్న టీచర్ మాదిరిగా చెబుతున్నాడు. అమర్ చానెల్‌కి 1.7 లక్షల సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. అమర్‌కి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలలో వీక్షకులున్నారు.


Kyra-Kanojia

కైరా కనోజియా..

కైరా కనోజియా ఒకరోజు తన రెండవ పుట్టినరోజు వేడుక వీడియో చూసింది. అందులో కుటుంబసభ్యులంతా కలిసి పాడిన పాట, తనని తాను చూసుకొని మురిసిపోయింది. కైరా సంతోషం చూసి తను చేసే అల్లరి వీడియోలను యూట్యూబ్‌లో పెట్టాలనుకున్నాడు కైరా తండ్రి మనీష్. ఆరోగ్యం బాగోలేని కారణంగా కొన్నిరోజులు మనీష్ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో పిల్లల్ని అలరించడానికి అన్‌బాక్సింగ్ వీడియోలు తీయమని తండ్రిని కోరింది. 2016లో కైరాస్కోప్ టాయ్ రివ్యూస్ చానెల్‌ని మొదలుపెట్టింది. కైరా చేసిన వీడియోలన్నింటినీ అందులో పోస్ట్ చేసేది. ఈ చానెల్‌కి పదివేల సబ్‌స్ర్కైబర్స్, 44 లక్షల వ్యూవ్స్‌తో మినీ సెలెబ్రిటీగా మారింది కైరా.


Anantya

అనంత్యా..

జూలై 2014లో అనంత్యా తల్లి, వ్లోగర్ శృతి రాజ్ ఆనంద్ కలిసి మైమిస్ ఆనంద్ అనే చానెల్‌ను స్టార్ట్ చేశారు. ఈ చానెల్ కేవలం తొమ్మిదేండ్ల అనంత్యా కోసమే. మొదలు పెట్టిన నాలుగు సంవత్సరాలకి కోట్లలో వ్యూస్ వచ్చాయి. చానెల్‌లో ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు పని చేస్తారు. వీరందరితో అనంత్యా బ్యూటీ టిప్స్, వంటల కార్యక్రమాలను య్యూట్యూబ్ ద్వారా విడుదల చేస్తుంది. అనంత్యా ప్రత్యేకంగా సులువైన మూడు క్యూట్ హెయిర్‌ైస్టెల్స్ ట్యుటోరియల్‌గా వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటుంది.


Aayu-and-Pihu-Kalra

ఆయూ, పీహూ కాల్ర..

ఐదేండ్ల ఆయూ, పదకొండు యేండ్ల పీహూ కలిసి 2017లో ఒక చానెల్ స్టార్ట్ చేశారు. దీని పేరు ఆయూ అండ్ పీహూ షో. దీని ద్వారా మొదట్లో బ్యూటీ టిప్స్, వంటల కార్యక్రమాలు అనుకున్నంతగా పేరు రాలేదు. పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్య జరిగే సంఘటనలన్నింటినీ స్క్రిప్ట్‌గా రాసుకొని షెడ్యూల్ తయారుచేసుకున్నారు. లక్షా 50 వేల పెట్టుబడితో వీడియోలు తీయడం చానెల్‌లో అప్‌లోడ్ చేయడం. రెండు సంవత్సరాలలో చానెల్‌కి పదిలక్షల సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు.


Nihal-Raj

నిహాల్ రాజ్..

నిహాల్‌ని అందరూ కిచా అని పిలుస్తుంటారు. కిచాకి మూడు సంవత్సరాల నుంచే వంటల మీద ఆసక్తి ఎక్కువ. తల్లి వంట చేస్తుంటే సాయం చేసేవాడు. 2016లో ఎల్లెన్ డిజెనరస్ షోని బాగా చూసేవాడు. ఇవాన్ ట్యూబ్ హెచ్‌డీలో వచ్చే వంటల కార్యక్రమాలను చూసి వాటిని ఇంట్లో తయారు చేసేవాడు. నిహాల్ కూడా ఒక చానెల్ మొదలుపెట్టాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే తండ్రి సాయంతో కిచాట్యూబ్ హెచ్‌డీ చానెల్‌ని స్టార్ట్ చేశాడు. నిహాల్ చేసే రకరకాల వంటలతో పిల్లలు, పెద్దలందరికీ స్టార్‌గా దగ్గరయ్యాడు. పేటియమ్ ద్వారా ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టుకునే అవకాశం కూడా కల్పించాడు. ఈ చానెల్ ద్వారా నిహాల్ లక్షకు పైగా డబ్బులు పోగుచేశాడు.
-వనజ వనిపెంట

879
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles