యూట్యూబ్‌లో మనమే టాప్‌!


Tue,April 16, 2019 11:51 PM

అవును.. ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా యూట్యూబ్‌తో దోస్తీ కట్టేది మనోళ్లే. గతంలో ప్రపంచదేశాల్లోకెల్లా అమెరికాలో ఎక్కువమంది యూట్యూబ్‌ వాడేవారు. స్థానిక భాషల్లో కూడా యూట్యూబ్‌ అందుబాటులోకి వచ్చేసరికి.. ఇండియాలో యూట్యూబర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో యూట్యూబ్‌ వాడే దేశాల్లో ఇండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అసలు మనోళ్లంతా ఎందుకు యూట్యూబ్‌కి ఎగబడుతున్నారు? యూట్యూబ్‌ ఎందుకు అంతగా ఆకట్టుకుంటున్నది? అసలు ఇండియాలో ఎంతమంది యూట్యూబ్‌ ప్రేమికులున్నారు? వంటి వివరాలతో ఈ వారం సంకేత కథనం..
YOU-TUBE
మొబైల్‌ డేటా చౌకగా లభిస్తుండటం, తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉండడం వంటి అంశాలు ఎక్కువమంది సోషల్‌ మీడియా, స్మార్ట్‌ఫోన్‌కి అలవాటు పడేలా చేశాయి. ఒకప్పుడు ఏదైనా సినిమా టీవీలో వస్తుందంటే.. పనులు మానుకొని మరీ చూసేవారు. టెక్నాలజీ విప్లవం, మొబైల్‌ డేటా ధరలు తగ్గడం, తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు దొరుకడంతో టీవీలకు అతుక్కుపోయిన జనాలు.. స్మార్ట్‌ఫోన్‌ తెరలకు అతుక్కుపోతున్నారు. దీనికి తోడు.. యూట్యూబ్‌ కూడా స్థానిక భాషల్లో అందుబాటులోకి తెచ్చింది. రకరకాల వీడియోలు, అవసరాల కోసం ఇండియాలో ఎక్కువమంది స్థానిక భాషల్లో యూట్యూబ్‌ని ఆశ్రయిస్తున్నారు. ఇంతకీ మనదేశం నుంచి యూట్యూబ్‌కి ఎంతమంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారో తెలుసా? అక్షరాలా 24.5 కోట్ల మంది. వీరిలో చాలామంది స్థానిక భాషల్లో వీడియో చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది గమనించి మొబైల్‌ తయారీ కంపెనీలు పెద్ద తెర ఉండే స్మార్ట్‌ఫోన్లు, వీడియో ఫ్రెండ్లీ మొబైల్‌ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేయడం మొదలుపెట్టాయి. దీంతో.. మొబైల్‌లోనే మంచి క్వాలిటీతో పెద్ద తెర మీద వీడియోలు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు యూట్యూబర్లు.

ఇదీ.. లెక్క!
titlep30
యూట్యూబ్‌ వచ్చి పదేండ్లయింది. ఎంత నిదానంగా వచ్చిందో.. అంతకంటే వేగంగా ప్రపంచమంతా విస్తరించింది. దీనికి తోడు టెక్నాలజీ కూడా రోజురోజుకూ డెవలప్‌ అయింది. గ్లోబల్‌ మార్కెట్‌లో, టెక్నాలజీ ప్రపంచంలో ఇండియా కూడా అదే దిశగా దూసుకుపోతున్నది. ఈ క్రమంలోనే ఇండియాలో యూట్యూబ్‌ వాడకం పెరిగింది. పదేండ్ల యూట్యూబ్‌ ప్రస్థానంలో 80శాతం మందిని ఇండియా నుంచే సంపాదించుకున్నది. స్థానిక భాషల్లో కూడా యూట్యూబ్‌ అందుబాటులోకి రావడంతో మిగతా దేశాల కంటే ఇండియాలో ఎక్కువమంది యూట్యూబ్‌ చూడడం మొదలుపెట్టారు. ఓ వైపు జనాభాలో రెండోస్థానంలో ఉండడం, దీనికి తోడు.. ఇక్కడ డేటా అతిచౌకగా లభించడం దీనికి మరో కారణం. మనదేశంలో పోస్ట్‌ అవుతున్న వీడియోల్లో 95శాతం వీడియోలు స్థానిక భాషల్లోనే ఉంటున్నాయి. ఈ కారణంగా రాబోయే రెండేండ్లలో ఇండియాలో యూట్యూబ్‌ యూజర్ల సంఖ్య 500 మిలియన్లకు చేరనుందట. ప్రస్తుతం మన దేశంలో యూట్యూబ్‌ వినియోగదారులు 24.5 కోట్ల మంది ఉన్నారు. మీకో విషయం తెలుసా..? ఇండియాలో యూట్యూబ్‌ వాడకాన్ని వందశాతానికి చేర్చడానికి గూగుల్‌ వాయిస్‌ సెర్చ్‌తో కలిసి పనిచేస్తున్నది. స్థానిక భాషల్లో వీడియో కంటెంట్‌ని సులభంగా వెతకడానికి గూగుల్‌ అసిస్టెంట్‌ సహాయం తీసుకుంటున్నది.

రోజురోజుకూ పెరుగుతున్న యూట్యూబ్‌ వినియోగదారులు, వీడియో ప్రేమికులను గమనించిన మొబైల్‌ కంపెనీలు యూట్యూబ్‌ ఫ్రెండ్లీ మొబైల్స్‌ తయారుచేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 20 బెస్ట్‌ యూట్యూబ్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లు, వాటి తెర సైజు మీకోసం..
youtube-to-mp3
1. ఎల్జీ వి40 థింక్‌యూ - 6.4 అంగుళాలు
2. హుయావ్‌ పి30 ప్రో - 6.5 అంగుళాలు
3. హానర్‌ వ్యూ 20 - 6.4 అంగుళాలు
4. ఎల్జీ వి30 - 6 అంగుళాలు
5. వన్‌ప్లస్‌ 6 - 6.28 అంగుళాలు
6.నోకియా 8 సిరూక్కూ - 5.5 అంగుళాలు
7. గూగుల్‌ పిక్సెల్‌ 3ఎక్స్‌ఎల్‌ - 6.3 అంగుళాలు
8. శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ - 6.4 అంగుళాలు
9. గూగుల్‌ పిక్సెల్‌ 3 - 5.5 అంగుళాలు
10. హువాయ్‌ మేట్‌ 20ప్రో - 6.4 అంగుళాలు
11. శాంసంగ్‌ ఎస్‌9ప్లస్‌ - 6.2 అంగుళాలు
12. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌9 - 5.8 అంగుళాలు
13. హువాయ్‌ పి20 - 6.2 అంగుళాలు
14. క్సియోమి ఎంఐ8 - 6.2 అంగుళాలు
15. గూగుల్‌ పిక్సెల్‌2 - 5 అంగుళాలు
16. ఎల్జీ జీ7 థింక్యూ - 6.1 అంగుళాలు
17. శాంసంగ్‌ గెలాక్సీ 8ప్లస్‌ - 6.2 అంగుళాలు
18. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8 - 5.8 అంగుళాలు
19. గూగుల్‌ పిక్సెల్‌ 2ఎక్స్‌ఎల్‌ - 6 అంగుళాలు
20. శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌8 - 6.3 అంగుళాలు

- ప్రపంచంలో మొత్తం 23 మిలియన్ల యూట్యూబ్‌ చానల్స్‌ ఉన్నాయి.
- ప్రతీ నెల 3.8 లక్షల వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి.
- ఈ వీడియోలకు 9.48 బిలియన్ల వ్యూస్‌ వస్తున్నాయి.
- ప్రతీ నెల 1.1 లక్షల సబ్‌స్ర్కైబర్లు పెరుగుతున్నారు.
- యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న వీడియోల్లో 65 శాతం ఇండియావే.
- ప్రతీ పదిమందిలో ఏడుగురు యూట్యూబ్‌ వ్యూయర్లు ఇండియా వారే.
- షార్ట్‌ఫిలింస్‌, సందేశాత్మక వీడియోలు, ప్రాంక్‌ వీడియోలు సొంతంగా క్రియేట్‌ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేవారి సంఖ్య కూడా బాగా పెరిగింది.
- సగటున ఒక భారతీయుడు నెలలో 475 నిమిషాలు యూట్యూబ్‌ చూస్తున్నాడు.
- 300 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు మొబైల్‌లో యూట్యూబ్‌ వాడుతున్నారు.
- ఫేస్‌బుక్‌కు 184 మిలియన్ల యూజర్లు, వాట్సప్‌కు 200 మిలియన్ల యూజర్లు ఉంటే.. యూట్యూబ్‌కి 245 మిలియన్ల యూజర్లున్నారు.

ప్రవీణ్‌కుమార్‌ సుంకరి

443
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles