యువ సైన్యం కోసం..


Tue,February 5, 2019 10:23 PM

సోదరభావాన్ని పెంపొందించడంతోపాటు దేశ శ్రేయస్సుకు పాటుపడే అవకాశం కల్పించేది రక్షణ రంగం మాత్రమే. అలాంటి రక్షణ రంగం వైపు ఎక్కువ మంది యువతను మేల్కొల్పి దేశ రక్షణలో భాగస్వాములను చేస్తున్నాడు ఓ ఆర్మీ అధికారి. అందుకోసం ప్రతి పాఠశాల,కళాశాలలకు వెళ్ళి మరింత మంది భారత సైనికులుగా మార్చేందుకు కృషి చేస్తున్నాడు.
sandeep-ahlawat
ఉత్తర ప్రదేశ్‌లోని ఖతులికి చెందిన కల్నల్ సందీప్ అహ్లావత్ ఆర్మీ అధికారిగా పనిచేస్తున్నాడు. భవిష్యత్ తరాలకు భారత సైనికుల త్యాగాలను గురించి తెలియజేస్తూ రక్షణ శాఖ ఔన్నత్యాన్ని వివరిస్తున్నాడు. 1947కు పూర్వం దేశ నాయకులు, సైనికులు ఏ విధంగా భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారనే అంశాలను మరోసారి ఆయా విద్యార్థులతో పంచుకుంటున్నాడు. యువకులను దేశ సేవలో భాగస్వాములను చేసేందుకు పాఠశాలలు, కళాశాలలే కాదు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రక్షణ దళం పోషిస్తున్న పాత్రను గురించి పాఠాలు చెబుతున్నాడు. అందులో భాగంగానే సందీప్ ఇప్పటి దాకా 30కి పైగా విద్యా సంస్థలను చుట్టి వచ్చాడు. ఐఐటీ ఢిల్లీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి విద్యా సంస్థలకు చెందిన 30వేల మంది విద్యార్థులను దేశ సేవ చేసేందుకు ప్రేరేపించాడు. విద్యార్థులకే కాకుండా నిరక్షరాస్యులకు సైతం దేశ రక్షణలో సైనికుల పాత్రను గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కువ మంది యువతను సైనికులుగా తీర్చి దిద్ది దేశ సమగ్రతను కాపాడుతున్నాడు.

423
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles