యువకులారా తస్మాత్ జాగ్రత్త!


Wed,September 5, 2018 01:07 AM

ఏదైనా పని చేయాలనుకొని ఇప్పుడేం చేస్తాంలే.. తర్వాత చేద్దాం అని వాయిదా వేస్తున్నారా? స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కువసేపు కాలక్షేపం చేస్తూ.. పనులు మర్చిపోతున్నారా? అయితే మీకు అమిగ్డలా పెరిగిపోతున్నట్లే. ఎప్పుడో వయసు మళ్లినప్పుడు వచ్చే ఈ వ్యాధి.. మారిన జీవనవిధానం, స్మార్ట్‌ఫోన్ వినియోగంతో యవ్వనంలోనే వచ్చేస్తుంది. మరి, దీనికి పరిష్కారం ఏంటో తెలుసా?
Mathimarupu
ఈ స్మార్ట్ యుగంలో ఎవరి దగ్గర చూసినా.. చేతిలో స్మార్ట్‌ఫోనే దర్శనమిస్తుంది. అదే ఇప్పుడు కొంపముంచుతున్నది. నిత్యం ఫోన్ బిజీలో పడిపోవడం వల్ల పనులు వాయిదా వేస్తూ, కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉంటూ, పరధ్యానం, భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఇలా ఉన్న యువతలో దాదాపు 300మందిని పరీక్షించి, వారికి స్కానింగ్ తీసిన తర్వాత అమిగ్డలా పెద్ద సైజులో ఉన్నట్లు గుర్తించారు. ఇది చెవి తమ్మెకు, కణతకు దగ్గరగా ఉంటుంది. ఇది పెరిగినవారు పరధ్యానం, ఆందోళనలో ఉంటూ, భావోద్వేగాలకు లోనవుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వారికి భావోద్వేగాలపై నియంత్రణ ఉండదని బోచమ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు ఎర్హాన్ జెంక్ చెబుతున్నారు. వీరితో పాటుగా ఒట్టావాలోని కార్ల్‌టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టిమ్ పైచిల్.. పనులు వాయిదా వేసే ఈ అలవాటుపై గత కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. వీరి అధ్యయనంలో డోరసల్ యాంటీరియల్ సింగులేట్ కోర్టెక్స్(డీఏసీసీ) అనే భాగానికి అమిగ్డలాకు మధ్య చాలా బలహీన సంబంధాలున్నాయని గుర్తించారు. అమిగ్డలా చిన్న సైజు(బాదాం గింజ)లో ఉంటేనే మంచిదని అంటున్నారు. ఇందుకోసం యువకులు ధ్యానం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు వాయిదా వేయకుండా ఆ పనిని వెంటనే పూర్తి చేయాలని, అవసరమైతే అలారం కూడా పెట్టుకోవాలంటున్నారు. ఏం పనులు చేయాలో రాసిపెట్టుకోవడం మంచిదంటున్నారు. ఇందుకు మొబైల్‌ను ైఫ్లెట్ మోడ్‌లో పెట్టుకున్న తప్పేం లేదంటున్నారు. కాబట్టి.. యువకులరా తస్మాత్ జాగ్రత్త.

2725
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles