యంగ్‌తరంగ్.. గో కార్టింగ్


Wed,September 5, 2018 01:12 AM

యువత అభిరుచి, ఆలోచనలు మారుతున్నాయి.అందువల్లే మార్కెట్‌లోకి కొత్త కొత్త ఆటలు అందుబాటులోకి వస్తున్నాయి.అభివృద్ధి చెందుతున్న లానుగుణంగా లైఫ్‌స్టయిల్‌ను మార్చుకుంటున్నారు.గో కార్టింగ్‌కు ఇప్పటికే క్రేజ్ ఉన్నా.. మన దగ్గర ఇప్పుడిప్పుడే వస్తున్నది.హైదరాబాద్ కేంద్రంగా యంగ్‌తరంగ్ చేస్తున్న గోకార్టింగ్ ఈవెంట్లపై ప్రత్యేక కథనం..
Riding
సుధీర్ ఎల్‌బీనగర్‌లో ఉంటున్నాడు. వరంగల్ నుంచి వచ్చి హాస్టల్‌లో ఉంటూ రామోజీఫిలిం సిటీ ఏరియాలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న సుధీర్‌కు వెహికిల్ డిజైనింగ్, ఇంజిన్ రీడిజైనింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే వేర్వేరు కార్ల పార్ట్‌లతో ఒక కొత్త రకం కారును తయారు చేశాడు. కానీ దాన్ని ఎక్కడ చూపించుకోవాలి. ఎక్కడ నడపాలో తెలియదు.

పాతబస్తీకి చెందిన సల్మాన్ రైడర్. టూ వీలర్, ఫోర్ వీలర్‌లతో గాల్లో చక్కర్లు కొడతాడు. బ్యాలెన్సింగ్, వీలింగ్ వంటి సాహసోపేతమైన ఫీట్లు చేస్తాడు. కానీ వాటికి పోటీలుంటాయని, గెలుపొందితే గుర్తింపు వస్తుందని తెలియదు. తెలిసినా వెళ్లే స్థోమత లేదు.

వరంగల్‌కు చెందిన సుధీర్, పాతబస్తీకి చెందిన సల్మాన్‌లకు మంచి సృజనాత్మకత ఉన్నా.. ప్రదర్శించడానికి వేదిక లేదు. ఇలాంటి యువకుల కోసం చాలా పోటీలు జరుగుతుంటాయి. తెలంగాణలో వీళ్లలాంటి యువకులు వందల్లో ఉంటారు. అలాంటి వాళ్ల ట్యాలెంట్‌ను గుర్తించడానికి నగరంలో ప్రతిరోజూ ఏదో ఒక మూలన ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గోకార్టింగ్‌కు ఇప్పుడు చాలా క్రేజ్ పెరిగింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గోకార్టింగ్‌కు మంచి గిరాకీ ఉన్నది. మొన్నటికి మొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు అనిందిత్‌రెడ్డి రేసింగ్‌లో సత్తా చాటాడు. వరుస టోర్నమెంట్లలో విజయాలు సాధిస్తూనే ఉన్నాడు. తెలంగాణలో ఇలాంటి ఆణిముత్యాలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లను వెలికి తీసేందుకు నగరంలో మరిన్ని పోటీలు జరుగుతున్నాయి.
Driving
నగరంలో గోకార్టింగ్ గ్రౌండ్‌లు ఐదారు ఉన్నాయి. మొదట ఎయిర్‌పోర్ట్‌లో, తర్వాత కొంపల్లిలోని రన్‌వే9, సెలబ్రిటీ రిసార్ట్స్‌లో మొదలుపెట్టారు. ఆ తర్వాత అత్యాధునిక హంగులతో మొదలైంది హెజెన్ గో కార్టింగ్. దీన్ని కిరణ్‌కుమార్ మోదిని, లోహిత్‌రెడ్డి గుర్రంలు కలిసి హెజెన్ గో కార్టింగ్‌ను స్థాపించారు. గుర్రంగూడలోని హాస్టన్ గో కార్టింగ్ కార్ రేస్ కేంద్రాన్ని 2017 ఏప్రిల్ 4న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వీళ్లు అందరిలా కాకుండా యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక ఈవెంట్లు చేస్తున్నారు.
BIKE
గతేడాది చేసిన ఈవెంట్‌లో నలభై మంది పోటీపడగా పద్దెనమిది మంది ఫైనల్స్‌కి వెళ్లారు. మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన నవల్ సింగాడ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ జట్టు చాంపియన్‌గా నిలిచారు. ఇబ్రహీంపట్నం గురునానక్ బృందం రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది కూడా గోకార్టింగ్ ఈ నెల 25, 26వ తేదీల్లో జరుగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే వాళ్లు సొంతంగా తయారు చేసుకున్న వాహనాలను నడుపుతారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ ఒక మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. సృజనాత్మకతతో చేసిన గోకార్ట్ వెహికిల్స్‌ను న్యాయనిర్ణేతలు ఎంపిక చేస్తారు. జరుగబోయే ఈ కార్యక్రమానికి వందల ఎంట్రీలు వచ్చినా ఫైనల్ లిస్ట్‌కు నలభై మందిని ఎంపిక చేసి వారిలోంచి విజేతలను ప్రకటిస్తారు.

691
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles