మ్యూజియం ఆన్ వీల్స్


Thu,August 16, 2018 10:50 PM

museum-onwheels
తెలంగాణ పర్యాటకరంగాభివృద్ధికి టూరిజం శాఖాధికారులు బస్సుతో ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో తెలంగాణ మ్యూజియం ఆన్ వీల్స్ బస్సుతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ బస్సులో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల ఫొటోలు, చారిత్రక, వారసత్వ కట్టడాల చిత్రాలు పర్యాటక ప్రాంతాల వివరాలతో కూడిన బ్రోచర్లు, పర్యాటక ప్రాంతాల ప్రాధాన్యం తెలిపేలా వీడియోలు ఉన్నాయి. స్టేట్ మ్యూజియంలో ఉన్న ఈజిప్ట్ మమ్మీని పోలిన నమూనాను బస్సులో ఏర్పాటు చేశారు. దీంతో నమూనా మమ్మీని చూడడానికి పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. ఈ బస్సు చార్మినార్, గోల్కొండ, ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నది. తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రాంతాలు వాటి చరిత్రను అధికారులు వివరిస్త్తున్నారు. వరంగల్‌లోని కాకతీయుల కళావైభవం, అద్భుతమైన చారిత్రక కోట, పాకాల చెరువు, నిజామాబాద్‌లోని మల్లారం అడవి, ఆర్కియాలాజికల్ మ్యూజియం, అప్పట్లో కుతుబ్‌షాహీలు, అస్‌ఫజాహీల ఆధీనంలో ఉన్న సంస్థానం దోమకొండ కోట, మెదక్‌లోని ఏడుపాయలు, సిద్దిపేటలోని కోటిలింగేశ్వరస్వామి.. ఇలా 31 జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాల చరిత్రపై సమగ్రంగా వివరిస్తున్నారు.

864
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles