మ్యూచువల్ ఫండ్లు రాబడికి రారాజు


Fri,February 1, 2019 11:55 PM

Mutual-funds
కన్జ్యూమరిజమే ప్రధానంగా మారిన నేటి సమాజంలో వ్యయాలు అంతకంతకు పెరిగిపోయాయి. గ్లోబలైజేషన్, మార్కెటింగ్ మాయాజాలంతో మన ఖర్చుచేసే పద్ధతులూ మారిపోయాయి. మన పెద్దలు భవిష్యత్ కోసం పొదుపుచేయడమే కాదు పిల్లలనూ గల్లా గురిగిల్లో పొదుపు చేసేలా ప్రోత్సహించారు. కానీ, ఇప్పటి కాలం వేరు. సంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారం, ప్రాపర్టీ ఇప్పుడు ఆకర్షణీయంగా ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇవి సామాన్యున్ని ఆదుకుంటున్నాయా? ఇవి కాల క్రమేణా ప్రభావాన్ని కోల్పోతున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ తగ్గిపోయింది. బంగారం, ప్రాపర్టీలలో లిక్విడిటీ సమస్యలున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్‌కు ఆదరణ పెరుగుతున్నది.

ఇప్పటికీ చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్‌మీద అవగాహన తక్కువే. నష్టపోతామన్న భయం మ్యూచువల్ ఫండ్స్‌కు చాలా మందిని దూరంగా ఉంచుతున్నది. నిజానికి ఏ మదుపు సాధనమైనా సరే కొన్ని రిస్క్‌లను కలిగివుంటుంది. మనం భరించగల రిస్క్‌లకు తగ్గట్టుగా పొదుపు లేదా మదుపు వ్యూహం ఉంటే సంపదను సృష్టించడంతో పాటు భవిష్యత్‌కు భద్రతను కల్పించవచ్చు. దీర్ఘకాలంలో మ్యూచువుల్ ఫండ్లు మంచి రిస్క్ పోగా మంచి రాబడులను అందిస్తాయి. మదుపు చేయడానికి మ్యూచువల్ ఫండ్స్‌పై ఉన్న అపోహలను పక్కన పెట్టడానికి ఇదే మంచి తరుణం. మనందరికి జీవితంలో చాలా లక్ష్యాలుంటాయి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం. మదుపు చేయడానికి స్టాక్ మార్కెట్‌పై అవగాహన చాలా అవసరం. మ్యూచువల్ ఫండ్లు నిపుణులు మీ తరపున మదుపును నిర్వహిస్తారు. వారు నిరంతరం మార్కెట్ కదలికలను గమనిస్తూ అందుకనుగుణంగా పోర్టుఫోలియోలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు.

మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా నిపుణులపై భరోసాతో ఉండవచ్చు. గత రెండు మూడు సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తున్న మొత్తం (ఏయుఎం) గణనీయంగా పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్‌పై అవగాహన కోసం అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) చేస్తున్న ప్రచారంతో ప్రజల్లో మార్పు కనిపిస్తున్నది. అయితే షేర్లలో, మ్యూచువల్ ఫండ్ల మదుపు చేసే వారి సంఖ్య అమెరికాతో పోల్చితే మనదేశం ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంది. మ్యూచువల్ ఫండ్లు అందిస్తున్న ఫ్లెక్సిబిలిటీ కారణంగా చాలా మందిని ఇప్పుడు ఆకర్షిస్తున్నాయి. ద్రవ్యోల్బణంతో పోల్చితే ఫిక్స్‌డ్ డిపాజిట్లమీద వచ్చే రాబడి చాలా తక్కువ. దీర్ఘకాలానికి మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తే రాబడి ఆకర్షణీయంగా ఉంటుంది.

మ్యూచువల్‌ఫండ్లు ఈక్విటీలు, బాండ్లు తదితర మదుపు సాధానాల్లో మదుపు చేస్తాయి కనుక రిస్క్ కూడా వివిధీకరణ జరుగుతుంది. మ్యూచువల్ వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా సొల్యూషన్స్‌ను మ్యూచువల్ ఫండ్లు అందిస్తున్నాయి. కొంత మంది ఎక్కువ రిస్క్‌ను మరికొంత మంది చాలా తక్కువ రిస్క్‌ను తీసుకోగల సామర్థ్యాన్ని కలిగిఉంటారు వారి వారి రిస్క్ సామర్థ్యానికి తగ్గట్టు మ్యూచువల్ ఫండ్లు స్కీమ్‌లను రూపొందించాయి. రిస్క్ తీసుకోగలిగిన వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఎక్కువ మొత్తాన్ని రిస్క్ తక్కువగా ఉండాలనుకునే వారు డెట్ ఫండ్లలో మదుపు చేయవచ్చు. వివిధ రకాల రిస్క్ సామర్థ్యాలకనుగుణంగా మ్యూచువల్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి.
Kumar
మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) ద్వారా రూ. 500 కనీస మొత్తాన్ని కూడా మదుపు చేసే అవకాశాలున్నాయి. నీటి చుక్కలే సముద్రం అయినట్టుగా చిన్న చిన్న మొత్తాలను క్రమంగా మదుపు చేస్తూ పోతూ ఉంటే మంచి సంపదను సృష్టించే అవకాశం ఉంది. 10 నుంచి 15 ఏండ్ల కాలానికి ఎస్‌ఐపీల ద్వారా మదుపు చేస్తూ ఉంటే దీర్ఘకాలానికి మిగతా అన్ని సాధనాల కన్నా అధిక రాబడిని పొందవచ్చు. బ్యాంకు అకౌంట్లను అనుసంధానం చేస్తూ ఆటో డెబిట్ పద్దతిలో ఎస్‌ఐపీల్లో మదుపు చేయవచ్చు.

ఎస్‌ఐపీల్లో మదుపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా అధికంగా వస్తుందని గత అనుభవాలు చెబుతున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు, పెన్షన్ ఫండ్లు, రిటైర్మెంట్ ఫండ్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు ఈక్విటీ మార్కెట్‌లో అధికంగా మదుపు చేస్తున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల ప్రాబల్యం చాలా తగ్గిపోయింది. ఈ సంస్థాగత ఇన్వెస్టర్లంతా దీర్ఘకాలానికి మదుపు చేస్తున్నారు. స్వల్పకాలిక ఒడిదుడుకులను పట్టించుకోకుండా దీర్ఘకాల రాబడులే లక్ష్యంగా మదుపు చేస్తున్నాయి. ఒడిదుడుకుల తక్కువగా ఉన్న సమయంలో ఎక్కువ మొత్తాన్ని మదుపు చేయడం వల్ల మ్యూచువల్ మిగతా మదుపు సాధనాల కన్నా అధికంగా రాబడులను అందిస్తాయి. గత పదేండ్ల కాలంలో అత్యధిక రాబడులను అందించిన మ్యూచువల్ వివరాలు కింద టేబుల్‌లో అందిస్తున్నాం. ఇవన్నీ సగటున ఏటా 25 శాతం కన్నా ఎక్కువ రాబడిని అందించినవే.

649
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles