మోకాళ్ల నొప్పికి ఆయుర్వేదం


Sat,June 24, 2017 02:00 AM

పెయిన్ కిల్లర్లు నొప్పి తెలియకుండా చేస్తాయి తప్ప నొప్పిని పూర్తిగా తగ్గించలేవు. ముఖ్యంగా మోకాళ్ల నొప్పుల విషయంలో ఇది అక్షర సత్యం. కానీ ఆయుర్వేద చికిత్స ద్వారా నొప్పిని సమూలంగా దూరం చెయ్యడం సాధ్యమే.
iStock

మోకాలు నొప్పి ఎందుకు?

మోకాలుకు దెబ్బతగిలినపుడు, మోకాలు కీలును పట్టి ఉండే లిగమెంట్లు గాయపడొచ్చు. లేదా లోపల గాయం కావొచ్చు. అలా జరిగినప్పుడు మోకాలును కదల్చలేనంత నొప్పి ఉంటుంది. ఆ నొప్పి మోకాలి పైభాగం లేదా లోపలి భాగం నుంచైనా ఉండొచ్చు. మోకాలు కీలు మధ్య భాగంలో ఉండే క్రుసియేట్ లిగమెంట్‌కు గాయమైతే మోకాలి లోపలి నుంచి చురుకుమనే నొప్పి వస్తుంది. లోపల ఏదో నొక్కుకుంటున్నట్లుగా కూడా ఉంటుంది. వంగినా, నడుస్తున్నా నొప్పి ఇంకా తీవ్రమవుతుంది. కొందరిలో మోకాలి కీలులో ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా నొప్పి రావచ్చు. మోకాలుకు బలమైన దెబ్బతగలడం వల్ల కీలు లోపల రక్తస్రావం జరిగి కూడా నొప్పి రావచ్చు. ఇదేకాకుండా తొంటి నుంచి మోకాలు దాకా వ్యాపించి ఉండే లియోటిబియల్ బాండ్ అనే కండరానికి గాయం కావడం వల్ల కూడా మోకాళ్లలో నొప్పి రావచ్చు. ఇవేవీ కాకుండా సంధివాతం వల్ల మోకాళ్ల నొప్పులు రావచ్చు.

సంధివాతం అంటే..?

శరీరంలోని సమస్త కదలికలకు అవసరమైన వాతం సహజంగా అందరి శరీరాల్లోనూ ఉంటుంది. అయితే ఈ వాతం ప్రకోపితమైనపుడు అంటే సమస్థితిని కోల్పోయినపుడు సంధివాతం మొదలవుతుంది. దీన్నే వాతం దూషితం కావడం అంటారు. సహజంగా వాతం కఫాన్ని దూషితం చేసినపుడు సంధివాతం మొదలవుతుంది. ఈ సమయంలో దూషిత లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ప్రధానంగా కీళ్లు బిగుసుకుపోవడం, కదిలినపుడు శబ్దాలు రావడం, ముట్టుకున్నప్పుడు ఆ భాగం వేడిగా అనిపించడం, ఎర్రగా మారడం, కూర్చుని లేస్తున్నపుడు, కూర్చుంటున్నపుడు నొప్పిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మందిలో చాలా సేపు కూర్చున్న తర్వాత కానీ, పడుకుని లేచినపుడు కానీ, వెంటనే లేచి నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కాసేపు నడిచాక బిగుసుకుపోయిన భాగాలు సడలి, నడకలో కొంత సౌకర్యం ఏర్పడుతుంది. సంధివాతంలో ఇది ముఖ్య లక్షణం.

ఆయుర్వేద చికిత్స


dr;srinivasu
ఏ కారణంగా కీళ్లనొప్పులు మొదలైనా వాతహర చికిత్సలు చేయడం ద్వారా సమస్యను తొలగించవచ్చు. అరిగి పోయిన కార్టిలేజ్ తిరిగి వృద్ధి చెయ్యడం ద్వారా మాత్రమే ఈ సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. అందుకుగానూ ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన ఔషధ యుక్త తైలాలలో చేసే జానువస్తి చికిత్స ఉంటుంది. దీని వల్ల మోకాళ్లలో అరిగిపోయిన భాగాలన్నీ తిరిగి వృద్ధి చెందుతాయి. తైలాల ద్వారా కొన్ని రకాల మాత్రల ద్వారా అరిగిపోయిన కార్టిలేజ్‌ను తిరిగి ఉద్ధరించే పూర్తి అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి కార్టిలేజ్‌ను పునరుద్ధరించే శక్తి ఆయుర్వేద తైలాలకు మాత్రమే ఉంది. జానువస్తిలో ఉపయోగించే తైలం ఎంతో ప్రత్యేకమైంది. వీటితో మోకాళ్ల నొప్పులు సమూలంగా తగ్గిపోతాయి. ఆయుర్వేద వైద్యుల్ని సూచించిన చికిత్సలన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటే తిరిగి పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చు.

557
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles