మోకాళ్లనొప్పులకు ఆయుర్వేదం


Thu,January 12, 2017 01:48 AM

మోకాళ్ల నొప్పులు రావడానికి శరీరంలోని మరేదైనా అనారోగ్యం కూడా కారణం కావచ్చు. జీర్ణవ్యవస్థ సరిగా లేకపోతే ఎంత పౌష్టికాహారం తీసుకున్నా అది ఒంటికి పట్టదు. జీర్ణవ్యవస్థలో లోపాలు ఏర్పడడానికి మౌలికంగా జఠారాగ్ని తగ్గడమే కారణం. జఠరాగ్ని తగ్గితే సమస్త వ్యవస్థలతో పాటు కండరాలు, ఎముకలు బలహీనపడి అంతిమంగా కీళ్లనొప్పులు మొదలు కావచ్చు. అందువల్ల మోకాళ్ల నొప్పులకు వైద్య చికిత్సలు తీసుకుంటూనే జీర్ణాశయ సమస్యలు తొలగడానికి అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. శరీరాన్ని ఇలా మొత్తంగా అన్ని కోణాల్లోంచి పరిశీలించి చికిత్స చేస్తేనే మోకాళ్ల నొప్పులు సమూలంగా తొలగిపోతాయి. అవన్నీ వదిలేసి, మోకాలి చికిత్సలకే పరిమితమైనే ఫలితం పెద్దగా ఉండదు.
medicinalcure

పోషకాలు చాలా ముఖ్యం


మోకాలి నిర్మాణం, దాని సౌష్టవం, పనితీరు రస, రక్త, మాంస ధాతువుల మీద ఆధారపడి ఉంటుంది. బి -12 అనేది పనితనాన్ని పెంచేందుకు ఉపయోగపడే విటమిన్. మౌలికంగా ఈ పనితనం కండరాల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల నాడీ వ్యవస్థ నియంత్రణలో ఉండే కండరాలు పనిచేయడం కోసం బి12 విటమిన్ ఉపయోగపడుతుంది. వాస్తవానికి నాడీ వ్యవస్థ కూడా ఒకరకమైన కణజాలమే. దానికి కూడా ఈ విటమిన్లు, శక్తి ప్రసాదకాలు అవసరమే. అలాంటి విటమిన్లలో ప్రధానమైంది బి12. అందుకే చాలా సార్లు నాడీ వ్యవస్థ రుగ్మతల్లో బి12 భూమికే ఎక్కువగా కనిపిస్తుంది.

వ్యర్థాలు తొలగాలి


కీళల నొప్పులను పరీశీలిస్తున్నపుడు ఈ సమస్య మాంసకృత్తుల లోపమా? కాల్షియం లోపమా? చివరికి సాధారణ జీవక్రియల్లో ఉపయోగపడే ఇనుము లోపం వల్లనా? లేక కాపర్, మెగ్నిషియం, మాంగనీస్, సర్కులేటివ్ సిస్టమ్‌ను బ్యాలెన్స్ చేసే ఇవన్నీ లోపించినపుడు కూడా కీళ్లనొప్పుల సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లోనే ఎక్కువగా లభిస్తాయి. వీటితో పాటు కీళల్లో పేరుకుపోయిన వ్యర్థపదార్థాలు అంటే సైనోవియల్ అతిగా ఉత్పన్నమైన సమస్యే అవుతుంది. ఆహారపదార్థాల్ని మార్చడం, వాటి పరిమాణాన్ని తగ్గించడం ద్వారా రస రక్త మాంస ధాతువుల్ని చైతన్య పరుస్తున్నారు. కీళ్లకు అవసరమైనదే అయినా సైనోవియల్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఉత్పన్నమైతే అవి మాలిన్యాలుగా హానికరంగా తయారవుతాయి. వాటివి ంత గొప్పవైనా అవసరం లేనపుడు అవి వ్యర్ధ పదార్థాలే అవుతాయి. ఈ వ్యర్థాల వల్ల కీళ్లు పనిచేయకుండా పోతే వాటిని తిరిగి పూర్వ స్థితికి తీసుకురావడం ఒకప్రధాన చికిత్స అవుతుంది. అందుకు ఆయుర్వేద చికిత్సల అవసరం ఉంటుంది. చికిత్సలతో పాటు లఘు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తక్కువ ఆహారం తీసుకున్నా కేలరీలు మాత్రం తగ్గకూడదు. ఆహరపదార్థాలు కూడా తేలికగా జీర్ణమయ్యేలా ఉండాలి.

ఆయుర్వేద చికిత్స


srinivas
జీవక్రియల్లో ఏ లోపం వచ్చినా అది ధాతుక్షయానికి దారి తీస్తుంది. అదే సమయంలో ధాతు క్షయం జీవక్రియలు మరింత కుంటుపడడానికి దారి తీయవచ్చు. అందుకే సహజ వేగాన్ని మించి ధాతుక్షయం జరగకుండా చూసుకోవాలి. మోకాలి నొప్పులు ధాతువులు క్షీణించినా రావచ్చు. ధాతువులు అతిగా పెరగడం వల్లనైనా రావచ్చు. అందుకే ధాతుశక్తిని పరీక్షించడం ముఖ్యమవుతుంది. అదే సమయంలో ధాతువుల్ని పూర్వ స్థితికి తేవడానికి ధాతువులను పరిపుష్టం చేయ్యడానికి అవసరమైన చికిత్సలు చెయ్యాల్సి ఉంటుంది. ఈ సంధివాత చికిత్సలో భాగంగా బాహ్య చికిత్సలు, అభ్యంతర చికిత్సలు ఉంటాయి. వీటితో పాటు మోకాలి నొప్పుల కోసం ప్రత్యేకమైన జానువస్తి చికిత్సలు చెయ్యాల్సి ఉంటుంది. శరీరంలోని ఏ భాగంలో సమస్య ఉంటే ఆ భాగానికే చికిత్స చేస్తామని ఎవరైనా అంటే అది తాత్కలికమైన ఉపశమనాన్నే ఇస్తుంది. నొప్పి ఎముకల సంబంధితమైన అస్థిధాతువులోనే సమస్య ఉన్నా మిగతా ధాతువులన్నింటికీ చికిత్స చెయ్యాల్సి ఉంటుంది. అప్పుడే మోకాలి నొప్పులు సమూలంగా శాశ్వతంగా నమయవుతాయి.

1156
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles