మోకాలు కీలు మార్పిడి చేయించుకుంటే ప్రమాదమా?


Sat,February 23, 2019 01:45 AM

ప్రశ్న: నా వయస్సు 54 సంవత్సరాలు. బ్యాంకు ఉద్యోగిని. ఉండాల్సిన బరువు కంటే 15 కేజీలు ఎక్కువ ఉన్నాను. గడిచిన ఇరవై యేండ్లుగా మోటార్ సైకిల్ వాడుతున్నాను. నాలుగు నెలల క్రితం ఎడమ మెకాలు తీవ్రమైన నొప్పితో నడవలేని స్థితిలో డాక్టర్‌కు చూపించుకున్నాను. పరీక్షలు చేసి జాయింట్ రిప్లెస్మెంట్ చేయాలన్నారు. సెంకడ్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు కూడా సూపర్ స్పెషలిస్టు డాక్టర్ అలాగే చెప్పారు. దీని కోసం ఆస్పత్రిని ఎంపికచేసుకునేటపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి సూచించండి.
-సుధాకర్‌రెడ్డి, యదాద్రి భువనగిరి

COUNSELLING
కీలుమార్పిడి ఓ క్లిష్టమైన శస్త్రచికిత్స. ఇందుకోసం సరైన సర్జన్, సరైన ఆస్పత్రి ఎంపిక మీ జీవితంపైన చాలా ప్రభావం చూపుతుంది. విజయవంతంగా కీళ్లమార్పిడి ఆపరేషన్లను తరచూ నిర్వహించిన అనుభవం గల నిపుణులు ఉండి, పెద్ద సంఖ్యలో నిర్వహించే అత్యాధునిక వైద్యసదుపాయాలు గల ఆస్పత్రిని ఎంపికచేసుకోండి. ఇందుకోసం మీరు వేర్వేరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వాటిలోని నిపుణులను గూర్చి సమాచారాన్ని తెలుసుకోవాలి, కొన్ని ముఖ్య అంశాలను పరిశీలించి తుదినిర్ణయం తీసుకోవాలి. కీలు మార్పిడి శస్త్రచికిత్సకు సంబంధించి ఆస్పత్రిలో ఆధునిక సౌకర్యాలు, సర్జన్, ఫిజియోథెరపిస్ట్ ఉండేలా చూసుకోవాలి. అందువల్ల కీలు మార్పిడి ఆపరేషన్ ఏర్పాటు గల ఆస్పత్రిని సంప్రదించినపుడు ఈ కింది అంశాలను దృష్టిలో ఉంచుకుని వివరాలను తెలుసుకొండి.

-ఆస్పత్రిలో ఎంత తరచుగా కీలు మార్పిడి ఆపరేషన్లు జరుగుతుంటాయి?
-మీ కీలు ఉన్న పరిస్థితిలో అది విజయవంతం అయ్యే అవకాశాలు ఎంతమేరకు ఉంటాయి?
-ఈ ఆపరేషన్ తర్వాత సాధారణంగా ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని వారు ఎలా పరిష్కరించారు?
-ఇదివరకు ఆపరేషన్ చేయించుకున్న వారెవరితోనైనా కలవవచ్చా?
-ఆపరేషన్ నిర్వహించే సర్జన్, తర్వాత ఫిజియోథెరపీ చేసే నిపుణులను ముందుగా మాట్లాడవచ్చా?

-మోకాలు కీలు మార్పిడికి సంబంధించి మరింత మెరుగైన నూతన శస్త్రచికిత్సా పద్ధతులు, అధునాతనమైన కృత్రిమ కీళ్ళ అందుబాటులోకి వచ్చాయి. మొత్తం కీలును మార్చే పాత విధానాలకు భిన్నంగా ఇప్పుడు అవసరమైన భాగాన్ని మార్థమే మార్చేందుకు వీలవుతుంది. అందువల్ల కీలు పరిస్థితిని బట్టి పూర్తి మోకాలు కీలునో లేదా అందులో కొంత భాగాన్నే మాత్రమే మార్చేందుకు వైద్యులు నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. ఇంతకు ముందుతో పోలిస్తే మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్లలో చాలా మంచి ఫలితాలు సాధించగలుగుతున్నారు. ఆపరేషన్ తర్వాత ఇరవై నాలుగు గంటలలోనే ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు వీలవుతున్నది. ఆ పైన ఫిజియోథెరఫి తీసుకోవటం ద్వారా స్వల్ప కాలంలోనే నడవటం, రోజువారీ పనులు చేసుకోవటం వంటి సాధారణ కార్యకలాపాలతోపాటు కొన్ని రకాల క్రీడలలో పాల్గొనటం కూడా సాధ్యపడుతున్నది. అందువల్ల ఎటువంటి సంకోచం లేకుండా కీలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది.

డాక్టర్ ప్రవీణ్ రెడ్డి
సీనియర్ ఆర్థోపెడిక్,
జాయింట్ షిప్మెంట్ సర్జన్
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ హైదరాబాద్.

1338
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles