మైనస్ 17 డిగ్రీల చలిలో ఈత!


Sun,March 10, 2019 12:52 AM

సాధారణంగా ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదైతే చాలా మందికి వణుకు వస్తుంటుంది. చలి తీవ్రత పెరుగుతున్నా కొద్దీ ఏవేవో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాం. అయితే ఈ యువతి ఏకంగా మైనస్ 17 డిగ్రీల చలిలో బికినీతో ఈత కొట్టింది.
Swim-in-Ice
కజికిస్థాన్‌కు చెందిన ఈ యువతి పేరు జరీనా ఆండ్రీవుషీనా. ఈమె మంచు గడ్డలా ఉన్న కాస్పియన్ సముద్రంలో బికినీ ధరించి మరీ ఈత కొట్టింది. అది కూడా మైనస్ 17 డిగ్రీల చలిలో. జరీనా ఆండ్రీవుషీనా కాస్పియన్ సముద్రపు తూర్పు తీరంలో గల అక్టవు అనే ప్రాంతంలో నివసిస్తున్నది. ఆమె ఇంటి నుంచి సముద్రానికి చేరుకోవడానికి 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. అందుకే ఎంత చలిగా ఉన్నా సరే రెండేళ్లుగా ఇలానే స్విమ్ చేస్తున్నది. ఇలా బికినీలో ఈత కొడుతున్నప్పుడు తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది జరీనా. మంచు గడ్డల మధ్యలో ఈతకొట్టడం ఒక ప్రత్యేకానుభూతి అంటూ అభిరుచిని తెలుపుతున్నది. ఉదయాన్నే జాగింగ్ చేసిన తర్వాత ఐస్ వాటర్‌లో మునగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, ఆరోగ్యవంతమైన వ్యక్తిగా మారానంటూ ఆ మహిళ తెలిపింది. అయితే ఇలాంటి వ్యాయామం రష్యా పరిసర దేశాల్లో బాగా జనాదరణ పొందాయి.

819
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles