మేలైన నల్లద్రాక్ష


Sat,May 11, 2019 12:33 AM

నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తుంది. అత్యంత పోషక విలువలున్న ద్రాక్ష రసం తాగడం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. చర్మ సంరక్షణకు మాయిశ్చరైజర్ తయారీలోనూ వీటిని ఉపయోగిస్తారు.
black-grapes
-ద్రాక్షలో విటమిన్ సి, ఎ, బి6, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్పరస్, మెగ్నీషియం, సెలీనియంలాంటి ఎన్నో రకాల ఖనిజ లవణాలు ద్రాక్షల్లో సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. ఫ్లేవనాయిడ్స్‌లాంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఫ్రీరాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి.
-ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు ఆస్తమాను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. ద్రాక్షపండ్లలో టీరోస్టిల్‌బీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదును తగ్గిస్తుంది. ద్రాక్ష పొట్టులో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి.
-నల్లద్రాక్షల రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాలు తెలుపుతున్నాయి. ద్రాక్ష రసం క్యాన్సర్‌ను అణచివేయడమే కాదు. క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా అరికడుతుంది. ద్రాక్షలోని ఈ పదార్థాలు మొత్తం శరీర వ్యాధి నిరోధక వ్యవస్థనే బలోపేతం చేస్తాయి.
-చాలామంది అసిడిటీతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవారు, ఒక గ్లాసు తాజా ద్రాక్షరసంను ప్రతి రోజు తాగడం వల్ల అసిడిటీ తగ్గుతుంది. తిన్న ఆహారం అరగకుండా అజీర్ణంతో బాధపడుతున్న వారు ద్రాక్ష రసాన్ని కానీ ద్రాక్ష పండ్లను కానీ తీసుకోవడం వల్ల అజీర్తిని అరికట్టవచ్చు.
-ద్రాక్షలో సెల్యులోజ్, ఆర్గానిక్ ఆసిడ్, షుగర్ వంటివి మలబద్దకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల మలబద్దకంతో బాధపడేవారు ద్రాక్షను తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ద్రాక్ష రసం కడుపులోని పేగులను శుభ్రపరుస్తుంది.

481
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles